Prabhas Kalki Trailer: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించనున్న కల్కి

Prabhas Kalki Trailer : ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అశ్విని దత్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూడటం మొదలుపెట్టారు.

Prabhas Kalki Trailer

 

- Advertisement -

బాహుబలి తో రేంజ్ చేంజ్

బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చిన కూడా సలార్ సినిమాతో మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇకపోతే ఇప్పుడు రాబోయే కల్కి సినిమా త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. కల్కి సినిమా 4 పార్ట్స్ లో రానున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ మొదటి పార్ట్ లో కమలహాసన్ కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని సమాచారం. కమల్ హాసన్ అమితాబచ్చన్ దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్న కారణంగా ఈ సినిమా ట్రైలర్ను నేడు రిలీజ్ చేశారు.

కల్కి ట్రైలర్ టాక్

ట్రైలర్ మొదటినుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పైన అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా ఒక హాలీవుడ్ సినిమాను ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పొచ్చు. అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కూడా ఈ ట్రైలర్ లో కీలకంగా కనిపిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ చివర్లో కమల్ హాసన్ కనిపించి చెప్పిన “భయపడకు మరో ప్రపంచం వస్తుంది” ఫినిషింగ్ డైలాగ్ అదిరిపోయింది. కమలహాసన్ ఒళ్ళు గగుర్పొడిచే గెటప్ లో కనిపిస్తున్నారు. హిస్టరీ చూసుకో ఇప్పటివరకు ఒక ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవ్వని ఉన్నాయి. ఇది ఒక మైతిలాజికల్ సైంటిఫిక్ జోనర్ రాబోతున్న సినిమా. ఈ సినిమా వర్కౌట్ అయితే ప్రపంచ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు