OTT Movie : సముద్రం గాలి తగిలితే వింత జంతువులుగా మారే మనుషులు… ఊపిరి తీసుకోవడం మరిపించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కోసం ఈరోజు మరో అద్భుతమైన మూవీ సజెషన్ తో వచ్చేసాం. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ అంటే క్రైమ్ లేదా హారర్ కాంబినేషన్లోనే ఉంటాయి. కానీ అందులో సోషల్ మెసేజ్ ఉండే అవకాశం చాలా తక్కువ. కానీ మనం ఈరోజు చెప్పకపోతే ఈ మూవీ సజెషన్లో సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

సాధారణంగా భూమిపై ఏర్పడే కాలుష్యం, మనుషులు భూమిని నాశనం చేయడం, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన నీరు, గాలి లేకుండా చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. అయితే ఇలాంటి కథకు హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి ప్రేక్షకులకు ఒక కొత్త సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ జెఫ్రీ ఏ బ్రౌన్. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ది బీచ్ హౌస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీనీ ఒంటరిగా చూస్తే దడుచుకుంటారు. అంతేకాకుండా రక్తం వంటి వైలెన్స్ చూసి భయపడే వాళ్ళు చూడకుండా ఉంటేనే బెటర్.The Beach House' Review: "Something For Everyone" - Full Circle Cinema

కథలోకి వెళ్తే…

బీచ్ ఒడ్డున కొన్ని ఇల్లు ఉంటాయి. అందులో హీరో రాండిల్ తండ్రి ఇల్లు కూడా ఉంటుంది. బీచ్ హౌస్ కాబట్టి ప్రేయసితో రొమాంటిక్ గా గడుపుదాము అనే ఉద్దేశంతో తన గర్ల్ ఫ్రెండ్ ఎమిలీని తీసుకుని ఆ ఇంటికి వస్తాడు. అయితే వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎమిలీకి వాళ్లు ఉన్న ఇంట్లో ఓ మహిళ డైనింగ్ టేబుల్ పై కూర్చుని తింటున్నట్టుగా కనిపించడంతో వెంటనే వెళ్లి బాయ్ ఫ్రెండ్ ని తీసుకొస్తుంది. ఇక తండ్రి ఫ్రెండ్స్ ఇద్దరూ చాలా కాలంగా ఆ బీచ్ హౌస్ లోనే ఉంటున్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్లని చూసి భయపడిన ఎమిలీ అక్కడ్నుంచి వెళ్లిపోదామని చెప్తుంది. అయితే ఈ యువ జంటను అక్కడి నుంచి వెళ్ళిపోకుండా డిన్నర్ కోసం ఆహ్వానిస్తారు. తిన్నాక ఆ దంపతులు ఇద్దరూ కలిసి సరదాగా బీచ్ లోకి వెళ్తారు. ఆ తర్వాత దట్టమైన అలుముకుంటుంది.

- Advertisement -

ఆ తర్వాత రోజు ఉదయాన్నే మళ్లీ డైనింగ్ టేబుల్ పై ఎప్పటిలాగే ఆమె తింటూ కనిపిస్తుంది. అయితే ఈసారి ఎమిలీ వచ్చి పలకరించినా ఏం మాట్లాడదు. ఆ తర్వాత రాండిల్ ను తీసుకొని బీచ్ కి వెళ్ళిపోతుంది. అయితే అతను హెల్త్ బాలేదంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. బీచ్ లో మరో వ్యక్తి పిలిచినా పలకకుండా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే జెన్ ఆకారం పూర్తిగా మారిపోతుంది. పైగా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంది. మరి అ భయంకరమైన పరిస్థితి నుంచి ఒంటరిగా ఉన్న ఎమిలి ఎలా తప్పించుకుంది? ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమయ్యాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు