Vijay Sethupathi: చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి బుచ్చిబాబు కోసమే ఉప్పెన సినిమా చేశాను

Vijay Sethupathi: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులడు విజయ్ సేతుపతి ఒకరు. నటన మీద ఇంట్రెస్ట్ తో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదట చిన్న చిన్న సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన విజయ్ సేతుపతి. పిజ్జా సినిమాతో హీరోగా మారాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చని టెక్నికల్ గా చాలా అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించాడు కార్తీక్.

Uppena

పిజ్జా సినిమా చేసిన తర్వాత తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకున్నాడు విజయ్ సేతుపతి. పిజ్జా సూదుకవ్వం జుంగ, నడువుల కొంజెం పక్కత కానం వంటి సినిమాలు విజయ్ సేతుపతికి మంచి గుర్తింపును తీసుకొని వచ్చాయి. మెల్లగా విలన్ పాత్రలు కూడా చేయటం మొదలుపెట్టాడు విజయ్. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాలో భవాని అనే పాత్రలో కనిపించి భయంకరమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత విక్రమ్ సినిమాలో కూడా విలక్షణమైన అయిన పాత్రలో కనిపించాడు.

- Advertisement -

విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు విజయ్ తమిళ్లో చేసిన ఎన్నో సినిమాలు తెలుగు ఆడియన్స్ చూశారు. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన అనే సినిమాను చేశాడు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో కీర్తి శెట్టి తండ్రిగా రాయణం అనే పాత్రలో కనిపించాడు. ఈ పాత్రకి ఆ సినిమా ద్వారా మంచి పేరు లభించింది. అయితే దీని వెనకున్న ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు బయట పెట్టాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాను చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి కేవలం బుచ్చిబాబు కోసమే చేసినట్లు తెలిపాడు. బుచ్చిబాబుకి సినిమా మీద ఉన్న డెడికేషన్ నచ్చి ఈ సినిమాను చేసినట్లు విజయసేతుపతి తెలిపాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు