OTT Movie : భర్తపై అనుమానం పక్కింటి కుర్రాడిపై ప్రేమగా మారితే… కట్టుకున్న వాడికంటే ఓవర్ యాక్షన్

OTT Movie : అక్రమ సంబంధం, ఇల్లీగల్ ఎఫైర్ అనే పదాలను మనం ప్రతిరోజూ న్యూస్ లో చూడడం, వినడం జరుగుతూనే ఉంది. నిజానికి ఇలాంటి వాటి వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతాయి. కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో తెరకెక్కిన ఓ మూవీని ఈరోజు సజెషన్ లో తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆ మూవీ పేరు ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ఇల్లీగల్ ఎఫైర్ అనగానే సాధారణంగా పెళ్లైనప్పటికీ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం, ప్రాణాల మీద తెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే ఈ సినిమాలో కూడా భర్తపై అనుమానంతో అమ్మాయి పక్కింటి కుర్రాడి ప్రేమలో పడుతుంది. అయితే అతను కట్టుకున్న భర్త కంటే ఎక్కువ ఓవర్ చేస్తాడు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరు ది బాయ్ నెక్స్ట్ డోర్. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బో*ల్డ్ సన్నివేశాల ఘాటు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి.

Prime Video: The Boy Next Door

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో హీరోయిన్ కి భర్త పై అనుమానం ఉంటుంది. అతను ఆఫీస్ లో ఉండే సెక్రటరీతో రిలేషన్ పెట్టుకున్నాడేమో అనే అనుమానంతో ఆమె బుర్ర బద్దలవుతుంది. అయితే ఆ కోపాన్ని కొత్తగా పక్కింట్లోకి వచ్చిన అబ్బాయిపై ప్రేమగా మార్చుకుంటుంది. అతగాడు కూడా పెద్దగా ఆలోచించకుండా ఆమెతో కనెక్ట్ అవుతాడు. అయితే హీరోయిన్ ఆలోచించకుండా చేసిన ఈ పని ఎంత పెద్ద తప్పు అనేది ఆ తర్వాత అతను చేసే చేష్టలతో అర్థమవుతుంది. అతను ఊహించనంత ఎక్కువగా ఆమెతో బాండింగ్ పెంచుకుంటాడు. ఎలాగంటే ఒక సైకోలా మారేంతగా. అతను మనస్తత్వం ఎలాంటిది అంటే ఒకసారి తప్పు చేస్తే దానిని జీవితాంతం కంటిన్యూ చేయాలి అన్నట్టుగా ఉంటుంది.

ఇంకేముంది ఆమెపై భర్త కంటే ఎక్కువగా అజమాయిషీ చేస్తాడు. అయితే ఇదంతా గమనించి అతన్ని దూరంగా పెట్టాలి అని హీరోయిన్ ఫిక్స్ అవ్వగానే అతను సైకోలా మారిపోతాడు. ఆమె జీవితాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని ఫిక్స్ అయిపోయి, నరకం ఎలా ఉంటుందో బతికి ఉండగానే చూపిస్తాడు. ఆమె పని చేసే ఆఫీసుకి వెళ్లడం, ఆమె ఈమెయిల్ హ్యాక్ చేయడం, వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సన్నిహిత ఫోటోలను వర్క్ ప్లేస్ లో అంటించి అందరి ముందు పరువు తియ్యడం, ఆమె భర్త, కొడుకుతో క్లోజ్ అవ్వడం లాంటి మెంటల్ పనులన్నీ చేస్తాడు. అంతేకాదు ఆమె ఎక్కువగా ప్రేమించే వారిద్దరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. మరి ఈ దారుణమైన పరిస్థితుల నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుంది? తన భర్త, కుమారుడిని కాపాడుకోవడానికి ఆమె ఎలాంటి ప్లాన్ వేసింది? భర్తకు ఈ విషయం తెలిసిందా? సినిమాలో  చివరకు ఏం జరిగింది? అనేదే ది బాయ్ నెక్స్ట్ డోర్ మూవీ స్టోరీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు