Satyabhama : వీకెండ్ లో సత్తా చాటిన సత్యభామ..! అయినా ఇంకా కావాలి.?

Satyabhama : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో ఒకటైన “సత్యభామ”. కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ “సత్యభామ” (Satyabhama) క్రైమ్ ఇన్వస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిన యాక్షన్ చిత్రం కాగా, జూన్ 7న రిలీజ్ అయిన థియేటర్లలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా, మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్లను సాధించింది. అయితే రెండో రోజుతో కాస్త బెటర్ కలెక్షన్లను సాధించి గ్రోత్ పెంచుకుంది సత్యభామ. ఇక తాజాగా మూడో రోజు కూడా పూర్తయ్యాక మొదటి రెండు రోజుల కన్నా మంచి గ్రోత్ చూపించి డీసెంట్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక టాలీవుడ్ ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ నటించిన ఈ సత్యభామ లో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రలో కాజల్ కి జోడిగా నటించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా ని సుమన్ చిక్కాల డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, రవి వర్మ, నాగినీడు, హర్ష వర్ధన్, నేహా పఠాన్, సంపద కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. శశి కిరణ్ టిక్కా స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.

Satyabhama movie weekend collections

వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్లతో అదరగొట్టింది…

ఇక సత్యభామ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకన్నా ముందునుండే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా లో ప్రమోషన్లతో బాగా రచ్చ చేయగా, అనుకున్న ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. కానీ డీసెంట్ టాక్ తో రోజురోజుకి గ్రోత్ పెంచుకుంది. మొదటి రోజు కేవలం 20 లక్షల షేర్ రాబట్టగా, రెండో రోజు 24 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు సండే మిగిలిన సినిమాలు డ్రాప్ అవ్వగా ఈ సినిమా కి మాత్రం 6.5 వేలకు పైగా టికెట్ సేల్స్ బుక్ మై షోలో సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసి ఎంతో కొంత కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం. ఇక సత్యభామ సినిమా వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సాధించిన ట్రేడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
నైజాంలో 32 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 40 లక్షలు వసూలు చేయగా, ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలుపుకుని మరో పది లక్షలు రాబట్టింది.

- Advertisement -

ఇంకా జోరు చూపించాలి..

ఇక వీకెండ్ లో మొత్తం మీద సత్యభామ వరల్డ్ వైడ్ గా 83 లక్షల షేర్ ని 1.71 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 2 కోట్ల దాకా ఉండగా, ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 1.20 కోట్లు అయినా రాబట్టాలి. ఇక ఈ సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా, మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి. వర్కింగ్ డేస్ లో కొంచం హోల్డ్ చేస్తే కలెక్షన్స్ ని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాకి మరింత ప్రమోషన్లు చేస్తే రిజల్ట్ వేరేలా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు