Kirak RP:AAఆర్మీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ..!

Kiraak RP…ఇటీవల దేశంలో లోకసభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి..అయితే ఏపీలో మాత్రం ఎలక్షన్లు మరింత రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే.. ఎవరు ఊహించని విధంగా టిడిపి – జనసేన – బిజెపి కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎన్నడూ లేనంతగా సినీ గ్లామర్ కూడా సందడి చేసింది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చాలా మంది సినీ ప్రముఖులు, మెగా కుటుంబ సభ్యులు చివరికి జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రంగంలోకి దిగి పిఠాపురంలో ఆయన తరపున ప్రచారాలు నిర్వహించారు.. అంతేకాదు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం తెగ మద్దతు పలికారు ఇక అందరి కష్టం ఫలించింది అనే చెప్పాలి. ఏకంగా 70 వేల ఓట్లకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అల్లు అర్జున్ ఆర్మీని టార్గెట్ చేసిన కిర్రాక్ ఆర్పీ..

Kiraak RP: Kiraak RP made sensational comments on AA army..!
Kiraak RP: Kiraak RP made sensational comments on AA army..!

ఇదిలా ఉండగా జబర్దస్త్ ద్వారా మంచి పేరు సొంతం చేసుకుని ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట క్లౌడ్ కిచెన్ బిజినెస్ చేస్తున్న కిర్రాక్ ఆర్పి కొద్ది రోజులుగా జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ అటు వైసిపిని , వైసీపీకి సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలను కూడా దారుణంగా తిట్టిపోస్తున్నారు.. ముఖ్యంగా ఎవరిని ఎలా మాట్లాడుతున్నాను అనే స్పృహలో లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడుతూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీ హోటల్ పై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి .. ఆ తర్వాత అల్లు అర్జున్ పై కిర్రాక్ ఆర్పీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది..

అల్లు అర్జున్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్పీ..

ముఖ్యంగా కూటమికే మద్దతు పలుకుతూ అటు అల్లు అర్జున్ ఇటు వైసిపిని పూర్తిస్థాయిలో విమర్శిస్తున్నాడు ఆర్ పి.. జనసైనికులు ఒక ఆర్మీ… చంద్రబాబు క్యాడర్ ఒక ఆర్మీ .. కాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ నే కాదు.. మహిళలను అసభ్య పదజాలంతో తిట్టడంలో వారు దిట్ట… మొన్నటి వరకు వైసిపి ఆర్మీ ఎలా అయితే చేసిందో? ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ కూడా అలాగే చేస్తోంది.. నేను నా మాటలు నచ్చకపోతే నన్ను అనాలి కాని నా భార్య నుఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు..? నా భార్య ఇన్స్టా పోస్టులకు తప్పుగా కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? అల్లు అర్జున్.. మీరు చేసింది కూడా తప్పే.. మీరు పాన్ ఇండియా స్టార్ కావచ్చు.. ఒక మంచి యాక్టర్ కూడా కావచ్చు.. కానీ ఆరోజు శిల్పా రవి దగ్గరకు వెళ్లి తప్పు చేశారు. ఇప్పుడు ట్రోల్స్ చూసి కూడా ఎందుకు వూరుకుంటున్నారు..? మీ ఆర్మీ సామాజికంగా ఎలాంటి కార్యక్రమాలు చేయదు.. ఎందుకు శిల్పారవిని గెలిపించుకోలేకపోయారు? పుష్పా టికెట్ల ధరల విషయంలో జరిగిన వివాదం టైం లో మీ ఆర్మీ ఎక్కడికి వెళ్ళింది? అంటూ చాలా విమర్శిస్తూ కామెంట్లు చేశాడు ఆర్పి.. మొత్తానికి ఏదైనా ఆర్పీ చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేడిని ఇంకా పెంచుతున్నారని చెప్పవచ్చు. మరి ఆర్పీ మాటలకు అల్లు అర్జున్ ఆర్మీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు