Raayan : సరికొత్త రిలీజ్ డేట్ తో వచ్చేస్తున్న “రాయన్”…

Raayan : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ పొంగల్ కి కెప్టెన్ మిల్లర్ తో యావరేజ్ హిట్ కొట్టిన ధనుష్ పెద్దగా గ్యాప్ కూడా తీసుకోకుండా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో “కుబేర” సినిమా చేస్తున్నాడు. ఇక ధనుష్ స్వీయ దర్శకత్వంలో “రాయన్” అనే సినిమాను నటిస్తూ తెరకెక్కిస్తున్నాడన్న విషయం తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఆ మధ్య రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సందీప్ కిషన్, తమిళ్ నటుడు కాళిదాస్ కూడా కనిపించి హైప్ ఎక్కించారు. అలాగే ఈ సినిమాలో విలక్షణ దర్శక నటులు ఎస్.జె. సూర్య, సెల్వ రాఘవన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ధనుష్ 50వ చిత్రంగా తెరకెక్కుతున్న రాయన్ సినిమా జూన్ 13 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ షూటింగ్ డిలే కారణంగా సినిమాని వాయిదా వేశారు మేకర్స్. తాజాగా రాయన్ (Raayan) సినిమా సరికొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించడం జరిగింది.

Dhanush Raayan Movie New Release Date Fix

జులై లోనే వచ్చేస్తున్నా రాయన్..

ఇక ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ చిత్రంను జూలై 26, 2024 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రిలీజ్ చేసిన పోస్టర్ లో ధనుష్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. వెనకాల కాళికాదేవి విగ్రహం ఉండగా, ముందు రాయన్ గా ధనుష్ నిల్చుని ఉన్నాడు. ఇక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌కుమార్‌, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ధనుష్..

ఇక రాయన్ (Raayan) సినిమాను ధనుష్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నాడు. ఇక భారీ సినిమాలు పోటీగా ఉన్నా, వాటి మధ్యలో రాయన్ సింపుల్ గా రిలీజ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాయన్ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఈ సినిమా రిలీజ్ కాగానే తెలుగులో నటిస్తున్న కుబేర నెలన్నర రోజుల గ్యాప్ తో రిలీజ్ కానుందని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంలో నాగార్జున ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ధనుష్ ఒక బిచ్చగాడి నుండి ఒక బిలినియర్ గా ఎలా ఎదుగుతాడో చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కూడా ధనుష్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోతుందని, ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు