Darshan Arrested : హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ అరెస్ట్… ఆమె కోసమే చేశాడా?

Darshan Arrested : హత్య కేసులో ఛాలెంజింగ్ స్టార్, కాటేరా ఫేమ్ హీరో దర్శన్‌ను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ నేతృత్వంలోని గ్యాంగ్ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు.

పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశం!

పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకా స్వామిని హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు సమాచారం. హత్య చేసిన అనంతరం దర్శన్ ఆదేశాల మేరకు నలుగురు నిందితులు తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో దర్శన్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్టు చేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. దర్శన్ ను మైసూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు.

ಕೊಲೆ ಕೇಸ್​​ನಲ್ಲಿ ನಟ ದರ್ಶನ್​ ಅರೆಸ್ಟ್; ಬೆಂಗಳೂರಿನ ಮನೆ ಬಳಿ ಪೊಲೀಸ್ ಭದ್ರತೆ - Kannada News | Challenging star Actor Darshan arrested in murder case Police security near home in Bangalore kannada news ...

- Advertisement -

సినిమా స్టైల్ లో మర్డర్ ప్లాన్

ఈ ఘటన జూన్ 9న జరిగింది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారు. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్ చిత్ర దుర్గలోని దర్శన్ అభిమానుల సంస్థ అధ్యక్షుడికి ఫోన్ చేసి చిత్ర దుర్గ నుంచి రేణుకా స్వామిని తీసుకురావాలని కోరారు. అతను రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చి వినయ్‌కు చెందిన షెడ్డులో ఉంచాడు. దర్శన్ సహా నలుగురు వ్యక్తులు రేణుకా స్వామిపై దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం జూన్ 8వ తేదీ శనివారం రాత్రి రేణుకా స్వామిపై షెడ్డులోనే బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కామాక్షి పాళ్య కల్వర్టులో పడేశారు. ఆ తరువాత హత్యలో పాలు పంచుకున్న నిందితులంతా పరారయ్యారు. ఆదివారం ఉదయం రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. కుక్కలు ఈడ్చుకెళ్తుండగా రేణుకా స్వామి మృతదేహం కన్పించింది. కాగా విచారణ అనంతరం దర్శన్‌ను ఏసీపీ చందన్ బృందం అదుపులోకి తీసుకుంది.

మృతుడు ఎవరు?

మృతుడు రేణుకా స్వామి అపోలో మెడికల్‌ లో పని చేశారు. శనివారం రాత్రి రేణుకా స్వామికి ఫోన్ చేసిన కొందరు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి ప్లాన్ ప్రకారమే కొట్టి చంపారు. కుమారుడి మరణ వార్త విన్న రేణుకాస్వామి తల్లిదండ్రులు ప్రస్తుతం కామాక్షి పాళ్య స్టేషన్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పవిత్ర గౌడ ఎవరు ?

పవిత్ర గౌడ, దర్శన్ సన్నిహితులు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టుగా ఎన్నో వార్తలు వచ్చాయి. దర్శన్ భార్య ఏకంగా సోషల్ మీడియా వేదికగా తన భర్తతో సన్నిహితంగా ఉన్నందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరించింది. అయితే పవిత్ర ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తామిద్దరం సంతోషంగా పదేళ్లు కలిసి ఉన్నామని, తమది స్వచ్ఛమైన ప్రేమ అంటూనే చట్టపరమైన చర్యలకు తాను కూడా సిద్ధమేనని ఫైర్ అయ్యింది. కాగా పవిత్రకు ఇప్పటికే పెళ్ళయి, పిల్లాడు కూడా ఉన్నాడు. ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు