Harom Hara : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా టాలీవుడ్‌ హీరోలు..?

Harom Hara : నైట్రో స్టార్ పేరు సంపాదించుకున్న సుదీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో నటుడుగానే కాకుండా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుధీర్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో “శివ మనసులో శృతి” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమా అనంతరం కొన్ని సినిమాల్లో నటించి “ప్రేమ కథ చిత్రమ్” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉండగా…. సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం “హరోం హర”. ఈ సినిమా షూటింగ్ ముగించుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటించినట్లు సమాచారం. చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ మూవీని మాస్ యాక్షన్ గా రూపొందించారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్, సునీల్, జయప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Image
ఈ సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్ బ్యానర్ పై సుమంత్ జి. నాయుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని హోటల్ దస్పల్లాలో నిర్వహించనున్నారు. ఇక ఈవెంట్ కు టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్, విశ్వక్సేన్ గెస్ట్ లుగా రానున్నట్లు సమాచారం. ఇక ముఖ్య అతిధిగా మహేష్‌ బాబు రానున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు