BadeMiyan ChoteMiyan : 350 కోట్ల సినిమాకి నెట్టింట ఘోర అవమానం!

BadeMiyan ChoteMiyan : బాలీవుడ్ లో గత నెలన్నర కింద ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా “బడే మియా చోటే మియా”. బాలీవుడ్‌ స్టార్స్ అక్షయ్‌ కుమార్‌, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన ఈ సినిమా దాదాపు 350 కోట్ల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మిశ్రమంగా వచ్చాయి. బాలీవుడ్ లో మరో రొటీన్ మసాలా సినిమా రాబోతుందని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన సమయంలో సమ్మర్ అడ్వాంటేజ్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు సాధిస్తుందని అనుకున్నారు అందరూ. అలాగే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ కూడా భారీగా హడావిడి చేసారు. థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో చిత్ర యూనిట్ థియేటర్ల దగ్గర ప్రమోషన్లు చేస్తూ కాస్త హడావుడి చేయగలిగింది. అవన్నీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగానే ఉన్నా విడుదల తర్వాత వచ్చిన రివ్యూలు, మరియు పబ్లిక్‌ టాక్ కారణంగా సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. కనీసం థియేటర్లో రూ.60 కోట్లు కూడా వసూళ్లు చేయలేకపోయింది. ఇది ఒక రకంగా ఈ సినిమాకి ఘోర పరాభవం అనే చెప్పాలి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం సినిమా బడ్జెట్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఈ సినిమా అతిపెద్ద నష్టాలు తెచ్చిన సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

BadeMiyan ChoteMiyan was also a disaster in OTT

ఓటిటి లో ఘోర అవమానం?

ఇక ఈ మధ్య కాలంలో అతి పెద్ద డిజాస్టర్‌ గా బాలీవుడ్ వర్గాల వారు బడే మియా చోటే మియా (BadeMiyan ChoteMiyan) ను తేల్చేసారు. థియేట్రికల్ రన్ పరంగా అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్న, బడే మియా చోటే మియా కు ఓటీటీ లో అయినా కాస్త మంచి స్పందన వస్తుందని అంతా భావించారు. కానీ అక్కడ అంతకన్నా ఘోర పరాభవం ఎదురైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌ లో జూన్‌ 6 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఏ స్టార్‌ హీరో సినిమా విడుదల అయినా కూడా కనీసం వారం లేదా రెండు వారాల పాటు నెట్‌ ఫ్లిక్స్ లో టాప్‌ 10 లో నిలవడం జరుగుతుంది. కానీ ఈ సినిమా టాప్ 20 లో కూడా కనిపించడం లేదట. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంటే వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కానీ ఈ సినిమా కి మాత్రం అత్యంత దారుణమైన టాక్‌ రావడంతో పాటు, ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడే విధంగా సన్నివేశాలు ఉండటంతో ఓటీటీ లో కూడా ఘోర అవమానం ఎదురయ్యింది.

- Advertisement -

డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు కిలాడీ ప్రయత్నాలు..

ఇక బడే మియా చోటే మియా సినిమాతో కలెక్షన్ల పరంగానూ డిజాస్టర్ అందుకోగా, ఇప్పుడు ఓటిటి లో కూడా పరాభవం అందుకున్నందుకు ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాల్తో డ్యామేజ్ కాంత్రో చేసేందుకు ట్రై చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ ఆల్రెడీ ఓ రెండు హిందీ యాక్షన్ సినిమాల్లో బిజీగా ఉండగా, అక్షయ్ కుమార్ అయితే ఏకంగా అరడజను సినిమాలను లైన్లో పెట్టగా, అందులో నాలుగు హిట్ సినిమాలకి సీక్వెల్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పరువు కాపాడుకునే విషయంలో అందరికంటే ఎక్కువ అక్షయ్ కుమార్ కే ఉంది. ఎందుకంటే గత ఐదారేళ్లలో పదికి పైగా సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్కటంటే ఒక్క సరైన హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఇప్పుడు నిఖార్సైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరి చూడాలి రాబోయే సినిమాలతోనైనా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు