Sania Mirza: బయోపిక్ పై క్లారిటీ.. కానీ వాళ్ళు ఉండాల్సిందే..?

Sania Mirza.. గత కొన్ని సంవత్సరాలు నుంచి సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు స్టార్స్ గా గుర్తింపు పొందిన నటీనటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల పైన ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అలా వచ్చిన అన్ని బయోపిక్ కూడా దాదాపు హిట్ అయ్యాయి అని చెప్పాలి.. ఇప్పుడు ఈ క్రమంలోనే మరో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కూడా తన బయోపిక్ తెరకెక్కించడం పై ఆసక్తికర కామెంట్లు చేసింది.. తాజాగా సానియా మీర్జా బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సౌనా నెహ్వాల్ , షార్ప్ షూటర్ ఫిఫ్త్ కౌర్ తో కలసి.. ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో కి హాజరయ్యింది ఈ ముద్దుగుమ్మ.. షోలో భాగంగా కపిల్ శర్మ సానియా మీర్జా గురించి మాట్లాడుతూ.. ఈమె జీవిత చరిత్ర గురించి ప్రశ్నించాడు ప్రియాంక చోప్రా మేరీకోమ్ బయోపిక్ లో, ప్రియాంక సోదరి పరిణితి చోప్రా బ్యాడ్మింటన్ సౌనా నెహ్వాల్ బయోపిక్ లో నటించారు కదా.. మరి ఒకవేళ మీ బయోపిక్ తీస్తే అందులో ఏ హీరోయిన్ నటించాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగారు కపిల్ శర్మ…

నా బయోపిక్ లో నేనే నటిస్తా..

Sania Mirza: Clarity on the biopic.. But should they be there..?
Sania Mirza: Clarity on the biopic.. But should they be there..?

ఇక కపిల్ శర్మ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సానియా ఇలా మాట్లాడింది.. మన దేశంలో ఎంతోమంది మంచి మంచి నటీనటులు ఉన్నారు. వాళ్లలో నా బయోపిక్ లో ఎవరు నటించినా నాకు ఓకే ..అయితే షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్ లో నటిస్తానంటే కచ్చితంగా నేను నా పాత్రలో చేస్తాను అంటూ నవ్వుకుంటూ సరదాగా సమాధానం చెప్పింది సానియా మీర్జా.. మొత్తానికైతే షారుఖ్ ఖాన్ , అక్షయ్ కుమార్ నటిస్తే తన పాత్రలో తానే నటిస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.. మరి సానియా బయోపిక్ ని తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ ముందుకు వస్తారో చూడాలి.

సానియా మీర్జా జీవితం..

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మహిళల డబుల్స్ లో నంబర్ వన్ ర్యాంకు పొందిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునే వరకు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్ , డబుల్స్ విభాగాల్లో నెంబర్ వన్ క్రీడాకారిణి గా పేరు సొంతం చేసుకుంది. మొదటి నుంచి అత్యంత విజయవంతమైన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్గా పేరు దక్కించుకున్న ఈమె..అత్యంత ఎక్కువ పారితోషకం అందుకున్న అథ్లెటిక్ క్రీడాకారిణి కూడా ఈమె కావడం గమనార్హం..

- Advertisement -

వైవాహిక జీవితం..

ఇకపోతే శత్రుత్వ దేశమైన పాకిస్థాన్ కి చెందిన షోయబ్ మాలిక్ నుండీ విడాకులు తీసుకున్న తర్వాత కొడుకుతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు కొడుకుతో కలిసి పలు దేవాలయాలను కూడా సందర్శిస్తుంది. అందులో భాగంగానే.. ముస్లిం పవిత్ర స్థలమైన హజ్ కి ఈమె ప్రయాణమైనట్టుగా తెలుస్తోంది. విడాకుల బాధ నుంచి తేరుకోవడానికి తాను మానసికంగా పరివర్తన చెంది తిరిగి రెట్టింపు వేగంతో సక్సెస్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్లు..అందులో భాగంగానే ఈ యాత్రకు వెళ్తున్నట్టు స్పష్టం చేసింది సానియా మీర్జా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు