Ananya Panday : ఆ హీరోతో చేయాలనీ లైగర్ బ్యూటీ కోరిక..! ఇక తీరదులే అంటున్న నెటిజన్లు!

Ananya Panday : బాలీవుడ్ స్టార్ కిడ్ అయిన అనన్య పాండే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో పాగా వేద్దామనుకున్న ఆ ముంబై బ్యూటీ లైగర్ ప్లాప్ కావడంతో తిరిగి ముంబై వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఎలాగో బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ కిడ్ కాబట్టి కరణ్ జోహార్ లాంటి స్టార్ మేకర్స్ తెరకెక్కించే సినిమాల్లో ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోయిన్లకి ఛాన్సులు వస్తూనే ఉంటాయి. అయితే చూడ్డానికి క్యూట్ గా అందంగానే అనన్య పాండే బాగున్నా నటన పరంగా మాత్రం ఇంకా స్కూల్ దశలోనే ఉంది. తాను చేసిన అన్ని సినిమాల్లోనూ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నా, నటన పరంగా ఏమాత్రం మెప్పించలేకపోయింది. అయినా బాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఛాన్సులు రాకపోయినా, అడపాదడపా చిన్న హీరోల సినిమాల్లో నటిస్తూనే ఉంది.

Ananya Panday's dream is to do a film with Vijay Thalapathy

స్టార్ కిడ్ డ్రీం..

ఇదిలా ఉండగా సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు, హీరోయిన్స్‌ కి ఇతర టెక్నీషియన్స్ అందరికి డ్రీమ్‌ రోల్‌ లేదా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. చాలా మంది డ్రీమ్ రోల్‌ చేయడం అనేది కష్టమైంది. చాలా మంది టెక్నీషియన్స్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేయకుండానే కెరీర్‌ ను ముగించిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇక ఇప్పుడు అనన్య పాండే (Ananya Panday) గురించి ఈ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్నా, సక్సెస్ మాత్రం కావడం లేదు. ఇక హీరోయిన్‌ గా తెలుగు లో లైగర్‌ చేసి ఫ్లాప్ అయినా, స్టార్ కిడ్ కావడం వల్ల బాలీవుడ్‌ లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూ ఉండటం విశేషం. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు తమిళ హీరో విజయ్ తో కలిసి నటించాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ కోరిక విన్న నెటిజన్లు ఇక తన కోరిక తీరదని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక అనన్య డ్రీం తీరదులే?

అయితే అనన్య తలపతి విజయ్ తో నటించాలన్న కోరిక తీరదు అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో “గోట్” సినిమా చేస్తుండగా, ఆ సినిమా పూర్తికాగానే విజయ్ తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అలాంటి విజయ్‌ తో సినిమా చేయాలని అనుకోవడం, అదే తన డ్రీమ్‌ రోల్‌ అంటూ అనన్య పాండే చెప్పడం ట్రోలింగ్ కి కారణమవుతుంది. ఆల్రెడీ రాజకీయాల్లోకి వెళితే ఇక విజయ్ సినిమాలు చేయడని సమాచారం. అంటే అనన్య డ్రీం నెరవేరదు అని నెట్టింట నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. అదీ గాక హీరోయిన్ గా నటన పరంగా ఇంకా తొలిదశలోనే ఉన్న ఈ అమ్మాయి డ్రీం అయినంత మాత్రాన విజయ్ సినిమాలో ఎందుకు ఛాన్స్ వస్తుంది అని నెటిజన్లు అంటున్నారు. పలనా స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని చాలామంది హీరోయిన్లకి కోరిక ఉంటుంది. అంత మాత్రాన అందరికీ ఛాన్స్ రాదు కదా అని విజయ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అయితే అనన్యకి సౌత్ లో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది. అందువల్ల సౌత్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించడం కోసం విజయ్‌ వంటి సౌత్ స్టార్స్ పేర్లు చెప్తుందని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు