Kalki2898AD: టికెట్ ప్రైసెస్ ఇవే, ఆంధ్రప్రదేశ్ లో ఈ రేట్లు ఉండే అవకాశం

Kalki2898AD: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని అశ్వని దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కమలహాసన్ అమితాబచ్చన్ దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానెర్లో వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసింది. ఈ ట్రైలర్ కూడా సినిమా పైన అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా నాలుగు పార్ట్సుగా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.

తెలుగు సినిమా రీసెంట్ టైమ్స్ లో ఎంత పెద్ద స్థాయికి వెళ్తుందో మనందరికీ తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో నుంచి ఒక పెద్ద సినిమా వస్తుంది అని అంటే ప్రపంచమంతా ఎదురు చూడటం మొదలు పెట్టింది. అంతటి ఇంపాక్ట్ అని చూపించాయి కొన్ని తెలుగు సినిమాలు. ఇకపోతే కల్కి ట్రైలర్ చూస్తున్నాను చెప్పు హాలీవుడ్ రేంజ్ను దాటిపోయింది అనే విధంగా ఉంది. ఇకపోతే ప్రతిసారి ఇటువంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్ల విషయంలో ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమకు అధికారులకు మంచి సన్నిహిత్యం ఉంది. సినిమాల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుని ముందు అడుగులు వేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారేగాని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు.

హిట్ అయినా కలెక్షన్స్ లేవు

ఆంధ్రప్రదేశ్ లోని టికెట్ రేట్లు ఎంత తక్కువగా తగ్గించారో మనం ప్రత్యక్షంగా చూసాం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు థియేటర్ వద్ద డ్యూటీలు చేసేవాళ్లు. సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా కూడా కలెక్షన్స్ వచ్చేవి కావు. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో ఈ సినిమా నిర్మాత అశ్విని దత్తు కూడా మంచి సన్నిహిత్యం ఉంది. అందుకే కలికి సినిమా టికెట్ రేట్ల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

 Kalki 2898 AD

కల్కి సినిమా టిక్కెట్ రేట్లు ఇవే

ఇకపోతే కల్కి సినిమా టికెట్ రేట్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ విశ్వసనీ వర్గాల సమాచారం.తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లో టికెట్ రేటు 413/-, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ కాస్ట్ 236/- ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 206 రూపాయల నుంచి 354 రూపాయల వరకు టికెట్ కాస్ట్ ఉండే విధంగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు