Kalki2898AD Trailer : కల్కీ సినిమా నుంచి మరో ట్రైలర్..?

Kalki2898AD Trailer : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ సినిమా అనంతరం వరుస సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తన నటనకి కోట్లది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసింది. ప్రభాస్ సినిమా వచ్చిందంటే చాలు ఎగబడి చూసేవారు ఎంతోమంది ఉన్నారు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమా అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు.

ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన తాజా చిత్రం “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు అతి త్వరలోనే రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ అంతా బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా “కల్కి 2898 ఏడి”. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతున్న ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రభాస్.

Kalki 2898 AD Pre release event: He is the chief guest of pre release event..?

- Advertisement -

మైథాలజీకి, సైన్స్ ను లింక్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో “కల్కి 2898 ఏడి” కథను రూపొందించారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాలో శ్రీకృష్ణుడు మరణించిన 5వేల ఏళ్ల తర్వాత జరిగే కథ కాబట్టి టైటిల్ లో 2898 ఏడి అనే నెంబర్ ను చేర్చారు. కేవలం టైటిల్ విషయంలోనే కాదు క్యారెక్టర్స్ విషయంలో మైథాలాజికల్ రిఫరెన్స్ లు ఉండేలా ఈ సినిమాలో చూసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ సోమవారం రోజున రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ట్రెండింగ్ లో కూడా ఇదే ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్టు సమాచారం. దీని నిడివి 2.30 నిమిషాలు ఉండనున్నట్లు ట్రాక్ వస్తోంది. కాగా, ఈనెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు