Raviteja : మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్న మాస్ మహారాజా, పూజా కార్యక్రమం కూడా పూర్తయింది

Raviteja : మాస్ మహారాజ రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగి ముందుగా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. కృష్ణవంశీ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఈ సినిమా తర్వాత రవితేజ కి వరుస అవకాశాలు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమా క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇడియట్లో చంటిగాడు క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు పూరి జగన్నాథ్ అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. పూరి జగన్నాథ్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పటికీ పూరి జగన్నాథ్ కెరీర్ లో బెస్ట్ వర్క్ అంటే ఇడియట్ సినిమా అని చెప్పొచ్చు. ఇకపోతే తర్వాత కాలంలో రవితేజ ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశాడు. చాలామందిని దర్శకులుగా పరిచయం చేశాడు.

Raviteja75

- Advertisement -

రవితేజ పరిచయం చేసిన చాలా మంది దర్శకులు నేడు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ మిరపకాయ్ అనే సినిమాతో మరోసారి అవకాశం ఇచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత హరీష్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలానే పవర్ అనే సినిమాతో బాబీ దర్శకుడుగా పరిచయం చేశాడు రవితేజ. ఆ తర్వాత బాబి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేయటం మొదలు పెట్టాడు. ఇకపోతే ప్రస్తుతం బాబి బాలకృష్ణతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శీను అనే సినిమాతో గోపీచంద్ మలినేని ను కూడా దర్శకుడుగా పరిచయం చేశాడు. మీరందరూ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. సామజవరగమన అనే సినిమాకి రచయితగా పనిచేసిన భాను భోగవరపును దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 75వ సినిమాకు భాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీల నటిస్తుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు నేడు పూర్తయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు