Bucchibabu: ఎన్నాళ్ళో వేచిన సమయం

ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లు మార్కెట్ చేరుకున్నాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలను సాధించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇకపోతే ఉప్పెన తర్వాత ఇప్పటివరకు బుచ్చిబాబు ఒక సినిమా కూడా చేయలేదు.

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేశాడు బుచ్చిబాబు. అయితే కేవలం అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా, సుకుమార్ లెక్చలర్ గా పని చేస్తున్నప్పటి నుంచి సుకుమార్ దగ్గర స్టూడెంట్ గా చదువుకుని ఆ తర్వాత సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు బుచ్చిబాబు. అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబుని దర్శకుడుగా పరిచయం చేశాడు సుకుమార్. సుకుమార్ కేవలం బుచ్చిబాబుని మాత్రమే కాకుండా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్ గా పరిచయం చేశాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఉప్పెనను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాతో సక్సెస్ను అందుకున్న బుచ్చిబాబు తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

- Advertisement -

దాదాపు ఈ ప్రాజెక్టు కూడా కన్ఫర్మ్ అవుతుందని అందరూ అనుకున్నారు. అలానే నాన్నకు ప్రేమతో అనే సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ గా పనిచేయటం అక్కడితో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు కూడా మంచి రిలేషన్ ఉండటం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కు డేట్లు కుదరకపోవడం వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు.

ఇక ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఆడిషన్స్ కూడా ప్రస్తుతం నిర్వహిస్తుంది ఈ చిత్ర యూనిట్. ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలను కూడా పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే ఈ సినిమా పూజా కార్యక్రమాలు రేపు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ జాన్వి కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. లేకపోతే రేపు జరగబోయే పూజా కార్యక్రమాలు తర్వాత ఈ సినిమా గురించి ఇంకొన్ని విషయాలు తెలియనున్నాయి. ఈ సినిమాకు దాదాపు ఒక నాలుగు టైటిల్స్ వరకు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే పెద్ది అనే ఒక టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు రీసెంట్ గా వార్తలు వినిపించాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఉప్పెన తర్వాత ఇన్నేళ్ల వరకు వెయిట్ చేసిన బుచ్చిబాబు రెండవ సినిమా రేపటితో మొదలవ్వనుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు