Shivaji: సిద్ధం కండి.. ఫ్యాన్స్ ను మళ్లీ టెన్షన్ పెడుతున్న శివాజీ..!

సినీ పరిశ్రమ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరికి ఎప్పుడు ఎలా బ్రేక్ వస్తుందో చెప్పడం కష్టం. కొంతమంది మొదటి సినిమా తోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తే.. మరి కొంత మంది దశాబ్దాల తర్వాత సక్సెస్ అవుతూ ఉంటారు.. అలాంటి వారిలో శివాజీ కూడా ఒకరు… ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారుగా 90 కి పైగా చిత్రాలలో నటించిన శివాజీ.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా సత్తా చాటడమే కాదు తన డబ్బింగ్ తో ఏకంగా నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాలలో కూడా ప్రవేశించిన ఈయన ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.. కానీ 52 ఏళ్ళ వయసులో బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు శివాజీ..

90’s మిడిల్ క్లాస్ బయోపిక్..
బిగ్ బాస్ హౌస్లో ఊహించని విధంగా ఆడియన్స్ నుంచి మంచి మద్దతు సొంతం చేసుకొని మూడో ప్లేస్ లో నిలిచిన ఈయన బయటికి వచ్చిన తర్వాత 90’s మిడిల్ క్లాస్ బయోపిక్.. వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే పలు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తున్నాయంటూ తెలిపారు శివాజీ.. ఇక అందులో భాగంగానే తాజాగా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారింది.

సిద్ధం కండి. ఫాన్స్ కి సర్ప్రైజ్ అంటున్న శివాజీ..
తాజాగా ఇంస్టాగ్రామ్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు శివాజీ “సర్ప్రైజ్ కోసం రెడీగా ఉండండి.. చేయబోయేది ఏంటో తెలిస్తే మీకు మాటలు కూడా రావు” అంటూ ఆ పోస్ట్ కి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ ఫోటోలో క్రికెట్ బ్యాట్స్ పట్టుకొని శివాజీ, తరుణ్ భాస్కర్ కనిపించారు చూస్తుంటే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. మరి శివాజీ పెట్టిన ఈ పోస్ట్ కి చెప్పిన మాటలకి అసలు అర్థం ఏమిటో తెలియడం లేదు.. కొంతమంది ఏమో ఎవరైనా క్రికెటర్ బయోపిక్ తీస్తున్నారేమో అంటూ కామెంట్లు చేయగా.. మరి కొంతమంది సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారేమో అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..

- Advertisement -

శివాజీ మాటలపై క్లారిటీ..
మరి శివాజీ పెట్టిన పోస్ట్ కి ఇచ్చిన క్యాప్షన్ కి అసలు సంబంధం లేదు.. ఇది సినిమా గురించా లేక క్రికెట్ మ్యాచ్ గురించా అనేది కూడా తెలియాల్సి ఉంది.. మొత్తానికైతే అన్ని విషయాలపై క్లారిటీ రావాలి అంటే శివాజీ వీటిపై స్పందించాల్సి ఉంటుంది.. మరి శివాజీ షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మీరు కూడా చూసేయండి..

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు