Sivaji: శివాజీ రెండో భార్య.. ఎవరికీ తెలియని రహస్యం ఇదే..!

Sivaji: ప్రముఖ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.  ఈ క్రమంలోనే తనకు రెండో భార్య ఉందన్న విషయాన్ని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో అటు సినీ ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది విన్న నెటిజన్స్ ఏంటీ శివాజీకి రెండో భార్య ఉందా ? అంటూ పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ నటుడు శివాజీ హీరోగా మొదట్లో వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేసి మెప్పించారు. ఇక క్రమంగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో నటనకు బ్రేక్ ఇచ్చి రాజకీయ ఎంట్రీ తో ఫేమస్ అయ్యాడు. మొదట్లో ప్రధానమంత్రి మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తిట్టిన ఈయన , ఆ తర్వాత టిడిపి సానుభూతిపరుడుగా మారి ఆ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఇక అలాంటి సమయంలో బిగ్ బాస్ షోలో అవకాశం రావడంతో హౌస్ లోకి అడుగు పెట్టాడు.

ఇకపోతే తన నేచర్ కి ఎక్కువ కాలం హౌస్ లో ఉండడని ఎంతోమంది అనుకున్నారు కానీ చాలా మెచ్యూర్ గా గేమ్ ఆడి టైటిల్ ఫేవరెట్ అయ్యాడు.. అయితే టైటిల్ మాత్రం అందుకోలేకపోయాడు. శివాజీ హౌస్ లో ఉన్నంతసేపు స్పై బ్యాచ్ ని మెయింటైన్ చేయడం జరిగింది. అందులో ప్రశాంత్ , యావర్, శివాజీ వీరు ముగ్గురు స్పై బ్యాచ్ గా గుర్తింపు పొందగా.. వీరితో పోటీ పడే బ్యాచ్ లో శోభ, ప్రియాంక, అమర్ దీప్ సీరియల్ నటులు పోటీపడి మరీ ఆడారు.

- Advertisement -

ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తనకు రెండో భార్య ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు.. అయితే ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన అవసరం ఏమీ లేదు.. శివాజీ రెండో భార్య మనిషి కాదు కాఫీ.. అది లేకుండా ఉండలేనని హౌస్ లో కూడా కాఫీ లేదని ఏకంగా బిగ్ బాస్ తోనే గొడవ పెట్టుకున్నాడు శివాజీ.. కాఫీ పంపించకపోతే హౌస్ నుంచీ వెళ్లిపోతా అని గొడవ కూడా చేసిన ఆయన దెబ్బకు దిగివచ్చిన బిగ్ బాస్ శివాజీకి కాఫీ పంపించాడు. ఇక అదన్నమాట శివాజీ రెండో భార్య సంగతి. ఇక శివాజీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు శ్వేత.. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.. ఇక బిగ్ బాస్ షో పుణ్యమా అని శివాజీ కొడుకులు కూడా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు