Mega Family : వాళ్లకున్న ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు – శివాజీ

టాలీవుడ్ నటుడు శివాజీ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో చివరి ఎపిసోడ్ దాకా వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత శివాజీ కొన్ని రోజులు సినిమాలు గ్యాప్ ఇవ్వగా, తాజాగా సోషల్ మీడియా కి అందుబాటులోకి వచ్చాడు. ఇక శివాజీ తాజాగా నటించిన “90స్ మిడిల్ క్లాస్ బయోపిక్” అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.

ఇక ఈ ప్రెస్ మీట్ లో భాగంగా శివాజీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఈ ప్రెస్ మీట్ లో మెగా ఫ్యామిలీ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. మీడియా వాళ్ళు మెగా ఫ్యామిలీ నుండి ఈ సారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా? అని శివాజీని అడగగా, తాను పొలిటికల్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మానేశానని అన్నాడు. అయినా ఇదే లాస్ట్ అని తన జవాబునిచ్చేసాడు.

తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవ్వరికీ లేదంటూ, సీఎం అయ్యే అర్హత వాళ్ళకి ఉందని, అయితే గెలిపించాల్సిన విషయం ప్రజలకే తెలుసనీ అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలను పలు మీడియా ఛానెల్ వాళ్ళు ఎవరికీ నచ్చినట్టు వారు పలు విధాలుగా చూపిస్తున్నారు. అయితే స్వతహాగానే చిరంజీవి అభిమాని అయిన శివాజీకి పవన్ కళ్యాణ్ తో కూడా మంచి సాన్నిహత్యం ఉంది. అయితే శివాజీ గతంలో రాజకీయాల్లో ఉండడం వల్ల మెగా ఫ్యామిలీ పై కొన్ని కాంట్రావర్సీ వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్ దృష్టిలో ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇప్ప్పుడు అదే మెగా ఫ్యాన్స్ ని తాజాగా చేసిన కామెంట్స్ తో ఇంప్రెస్ చేసాడని చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు