Jayaprada: జయప్రద మిస్సింగ్.. పోలీసులు గాలింపు..!

ప్రముఖ సీనియర్ నటి.. రాజకీయ నాయకురాలు.. మాజీ ఎంపీ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సినిమాలలో ఉన్నప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్ వంటి హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె అవకాశాలు కరువైనప్పుడు రాజకీయ రంగప్రవేశం చేసింది. ఇకపోతే తాజాగా జయప్రద కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆమె కనిపించడం లేదనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా జయప్రద కనిపించకపోవడం తో ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. 2009 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన విషయంలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ నిమిత్తం హాజరుకావాలని.. పలుమార్లు జడ్జి ఆదేశించినా జయప్రద హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు.

ఇక జనవరి 10వ తేదీన జయప్రదను తమ ముందు ప్రవేశపెట్టాలని యూపీ పోలీసులకు కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను వెతికే పనిలో పడ్డారు పోలీస్ యంత్రాంగం.. అంతేకాదు ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేస్తున్నప్పటికీ కూడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదని తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 19న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా యూపీలోని ప్రాంతంలో ఉన్న నూర్పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు జయప్రద ఆ సమయంలో రాంపూర్ స్థానం నుంచి ఆమె బిజెపి టికెట్ పై పోటీ చేశారు. అంతేకాదు పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగసభలో జయప్రద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనేది మరో ఆరోపణ. దీంతో ఈ రెండు కేసులపై పోలీసులు విచారణ జరిగింది.

- Advertisement -

అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఈ కేసుల్లో గత కొన్ని రోజులుగా ఆమె కోర్టుకి హాజరు కావడం లేదు దీంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు.. ఢిల్లీ , ముంబైలోని పలుచోట్ల ప్రత్యేక పోలీస్ బృందాలు వెతికినా కూడా జయప్రద ఆచూకీ లభించలేదు. మరి ఆమె ఎక్కడుంది.. కోర్టు ముందు రావడానికి ఎందుకు భయపడుతోంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు