Dhoom 4: ధూమ్ 4 లో చెర్రీ.. పాత్ర తెలిస్తే షాక్..!

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం ఎక్కువగా అన్ని భాషలలో నటించడానికి మక్కువ చూపుతున్నారు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వార్ -2 చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందట. అయితే ఇందులో ఎన్టీఆర్ పాజిటివ్ రోల్ చేస్తున్నారా లేకపోతే హృతిక్ రోషన్ ని ఢీకొట్టే పాత్ర అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. ఇప్పుడు ఇదే దారిలో రామ్ చరణ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. గడిచిన కొంతకాలం నుంచి రామ్ చరణ్ ఎక్కువగా ముంబైకి వెళుతున్నట్లు తెలుస్తోంది.. అయితే ఇదంతా ఏదో బిజినెస్ పనిమీద లేదంటే వ్యక్తిగత విషయాలలో అని అనుకున్నారు.. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్లో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబైలో ఏకంగా ఒక ఫ్లాట్ ని తీసుకొని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లతో రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ధూమ్-4 లో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పవచ్చు. ధూమ్ సిరీస్ కి ఎంత ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పని లేదు. యశ్ రాజ్ బ్యానర్ లో వీటికి స్పెషల్ సిరీస్ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో నటించే ప్రతి ఒక్క హీరో రేంజ్ కూడా బాగా పాపులారిటీ అవుతుంది.

- Advertisement -

గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రాంచరణ్ ఇప్పుడు ధూమ్-4 లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.. ఇప్పటివరకు ధూమ్ సిరీస్ లలో కేవలం బాలీవుడ్ హీరోలే నటించారు. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ పేరు వినిపిస్తుండడంతో మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు .ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడం జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నారు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు