Ram Charan: ఇదేం ట్విస్ట్… మెగా వారసుడికి శ్రీకాంత్ వెన్నుపోటు…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో “గేమ్ ఛేంజర్” అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్లు అవుతున్నా రిలీజ్ డేట్ కి మాత్రం నోచుకోవడం లేదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత సంతోషపడ్డారో, రిలీజ్ డేట్ కూడా మేకర్స్ చెప్పలేక పోతున్నందుకు అంతకంటే ఎక్కువ బాధ పడుతున్నారు. అందరికంటే ఎక్కువగా దిల్ రాజు పై మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్.

ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ సినిమాపై వచ్చినన్ని లీక్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి వచ్చి ఉండవు. ఈ సినిమాలో నటిస్తున్న హీరో నుండి విలన్ దాకా, హీరోయిన్ నుండి కమెడియన్ దాకా అందరి లుక్స్ కూడా లీక్ అయిపోయాయి. పైగా వాళ్ళ రోల్స్ కూడా ఒక్కొక్కటి రివీల్ అవుతున్నాయి. మొదట్లో ఈ లీక్స్ ని చూసి కనీసం లీక్స్ ద్వారా నైనా అప్డేట్స్ అందుతున్నాయని సంతోషించిన మెగా ఫ్యాన్స్, ఇప్పుడు ఈ లీకులవల్లే గేమ్ ఛేంజర్ పై ఉన్న హైప్ తగ్గుతుందని బాధపడుతున్నారు.

ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీకాంత్ కూడా తన క్యారెక్టర్ రోల్ గురించి రివీల్ చేసేసాడు. తాజాగా కోట బొమ్మాళి సక్సెస్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీకాంత్ తాను చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తాను చేస్తున్న పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, తాను ఈ సినిమాలో ఒక అభ్యుదయ పార్టీ తరపున సీఎం గా నటిస్తున్నాని అన్నారు.

- Advertisement -

అలాగే రామ్ చరణ్ పార్టీ ప్రెసిడెంట్ పాత్ర చేస్తుండగా, ఓ సన్నివేశంలో తన పాత్ర రాంచరణ్ ని డామినేట్ చేస్తుందని శ్రీకాంత్ చెప్పడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చూసిన చరణ్ ఫ్యాన్స్ ఖుషి గానే ఉన్నా, కొందరు మెగా అభిమానులు ఇలా అన్నీ లీకులు చేస్తూ పోతే సినిమా వచ్చే సరికి హైప్ ఉండదు అంటున్నారు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు