Game Changer Movie: శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రల పేర్లు ఇవే!

Game Changer Movie

టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ కేజ్రీయెస్ట్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటి “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడన్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా శంకర్ తీసిన ఒకే ఒక్కడు మూవీ తరహాలో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం.

అయితే గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అవి తండ్రి కొడుకుల పాత్రలు కాగా, ఆ పాత్రల యొక్క పేర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ కుమార్. ఈ పాత్రలో రామ్ చరణ్ ఒక IAS ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక తాజాగా రెండో పాత్ర పేరు కూడా బయటికి వచ్చింది. రామ్ నందన్ తండ్రి అయిన ఆ పాత్ర పేరు “అప్పన్న” అని, ఆ పాత్ర లో రామ్ చరణ్ ఓ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని తెలిసింది. ఈ న్యూస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి తెలిసినప్పటి నుండి తెగ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటించగా, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, సముద్రఖని, ప్రియదర్శి, రాజీవ్ కనకాల, జయరాం, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, టీజర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు