Game changer: ఏంటి?.. పాటలకి వంద కోట్లా?

100 crores for game changer songs?

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కితున్న సినిమాల్లో ఒకటి “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లోను భారీ అంచనాలున్నాయి. శంకర్ స్టైల్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది.

గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2024 సమ్మర్ కి రిలీజ్ కానుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తవగా, కొంత గ్యాప్ తరువాత మళ్లీ మొదలైంది. ఇక ఇప్పటికే లీక్ అయిన కొన్ని స్టిల్స్ సినిమాపై ఉన్న అంచనాలని తారాస్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ నుండి తాజాగా వచ్చిన ఓ అప్డేట్ ఒక్కసారిగా ట్రెండ్ అయింది. అదేంటంటే గేమ్ ఛేంజర్ పాటలకోసం మేకర్స్ ఏకంగా 100 కోట్లు ఖర్చుపెడుతున్నారని సమాచారం.

సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలు కూడా చాలా గ్రాండియర్ గా ఉంటాయని తెలిసిందే. కొన్ని సినిమాల్లో పాటల ద్వారానే సినిమా కాన్సెప్ట్ ని చెప్పడం శంకర్ స్పెషలిటీ. జీన్స్, వంటి సినిమాల్లో 7 వండర్స్ ని ఒకే సినిమాలో చూపించడం తెలిసిందే. ఇక ఒకే ఒక్కడు మగధీర సాంగ్ తో సినిమా కాన్సెప్ట్ ని చెప్పడం జరిగింది.

- Advertisement -

ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా అలాంటి సాంగ్స్ తీస్తున్నారని టాక్. ఇక గేమ్ ఛేంజర్ లో మొత్తం 6పాటలుంటాయని థమన్ చెప్పడం జరిగింది. ఇక అందులో ఐదు పాటలకి గాను ఐదుగురు కొరియోగ్రాఫర్స్ పని చేస్తుండడం విశేషం. ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్ తో పాటు బోస్కో మార్టిన్ ఈ పాటలకి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి పాటలకే ఇంత ఖర్చుపెడితే ఇక సినిమాకి ఎంత ఖర్చవుతుందో. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ నుండి వచ్చిన ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ కొంత సంతృప్తి పడినా టీజర్ వచ్చే వరకు వాళ్ళు శాటిస్ఫై అవ్వరని తెలుస్తుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు