Shankar: భారీ ఫైట్ సీన్ చిత్రీకరణలో గేమ్ చేంజర్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక పొలిటికల్ గవర్నమెంట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతుండగా, రామ్ చరణ్ ఇందులో ఒక రాజకీయనాయకుడిగా, అలాగే ప్రభుత్వ అధికారిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం లేదన్నది తెలిసిందే. రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి పుట్టబోయే పాప కోసం విరామం తీసుకోగా, అటు శంకర్ ఇండియన్2 సినిమాతో బిజీ అయ్యాడు.

ఇక రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ గ్యాప్ వల్ల మూవీ అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా అని సందేహపడ్డారు. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ పై సినిమా అప్డేట్ల కోసం చేసిన రచ్చ గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా రీసెంట్ గా మళ్ళీ షూటింగ్ జరుపుకోవడం మొదలైంది. ముందుగా ఈ సినిమా షూట్లో డైరెక్టర్ హీరో ఇద్దరూ పాల్గొనలేదు. అయినా సినిమా షూట్ జరిగింది. హీరో లేకుండా ఈ సినిమాలో నటిస్తున్న ఇతర పాత్రధారులకి సంబంధించిన సీన్లను ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను శంకర్ సలహాతో తెరకెక్కించాడు. ఆ సీన్ లో జూనియర్ ఆర్టిస్ట్స్ రఘుబాబు, రాకెట్ రాఘవ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇక తాజాగా గేమ్ చేంజర్ సెట్స్ లో శంకర్ ఆఫీషియల్ గా అడుగుపెట్టాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఫైట్ సీన్ ని చిత్రీకరిస్తున్నట్టు శంకర్ తన ట్విట్టర్ పేజ్ లో పేర్కొన్నాడు. ఈ ఫైట్ సీన్ మూవీలో హైలెట్ సీన్లలో ఒకటి నిలుస్తుందని అన్నాడు. అయితే చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫైట్ సీన్ ఒక కార్ ఛేజింగ్ సీన్ ఉండబోతుందని అంటున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిపోగా మిగతా షూటింగ్ పూర్తవడానికి ఇంకా 90రోజుల సమయం పడుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు