NANI30: నిన్న నాని.. నేడు మృణాల్.. ప్రమోషన్స్‌ స్టైల్ మార్చేశారు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాని 30వ సినిమాగా రూపొందుతుండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి, కె. ఎస్ మూర్తి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 80 శాతం షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనీ చుస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా నాని30 యొక్క టైటిల్, గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేస్తున్నామని, నాని స్కై డైవింగ్ చేస్తూ సరికొత్తగా తెలిపాడు. తాజాగా ఇలాగే ఈ సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కొత్తగా ప్రమోట్ చేసింది. సముద్రంలో బోట్ లో ఉన్న మృణాల్ నాని30 టైటిల్, గ్లిమ్ప్స్ జులై13 న వచ్చేస్తుందని తెలిపింది. అయితే ఇంతకుముందు నాని ఇలా చెప్పినపుడు, టైటిల్ అనౌన్స్ మెంట్ గురించి చెప్పడానికి, అంత దూరం వెళ్ళారా అనిపించింది. కానీ తర్వాత ఇది ప్రమోషన్ లో కొత్త టెక్నిక్ అని తెలిసి నెటిజన్లు నవ్వుకున్నారు.

అసలు విషయానికి వస్తే నాని గాని, మృణాల్ గాని వాళ్ళు సినిమా ప్రమోషన్ కి ఎక్కడికి వెళ్ళలేదు. షూటింగ్ లోకేషన్లోనే భాగంగా, ఎప్పుడో రికార్డు చేసిన వీడియో క్లిప్స్ ని ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సింపుల్ గా చెప్పకుండా, ఇలా చెప్పడం బాగుంది. ఇక నాని30వ సినిమా రెగ్యులర్ మూవీస్ లా కాకుండా, తండ్రి కూతుళ్ళ మధ్య ఒక ఎమోషనల్ మూవీ గా తీస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు