Arjun Das : లోకి అడిగితే ఏదైనా చేస్తా – అర్జున్ దాస్

Arjun Das : కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన నటుడు “అర్జున్ దాస్”. కార్తీ ఖైదీ సినిమాతో పాపులర్ అయిన ఈ నటుడు ఇప్పుడు సౌత్ ఇండియా లోనే వెరీ బిజీ ఆక్టర్ లలో ఒకరు. అసలు ఇప్పుడు సౌత్‌ లో ఎక్కువగా వినిపిస్తున్న ఆర్టిస్టుల పేర్లలో అర్జున్ దాస్ కూడా ఒకరు. చేసే ప్రతి సినిమాలోనూ తన పాత్ర హైలెట్ అవుతుంది. గంభీరమైన గొంతు తనకి ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. నటుడిగా అర్జున్ దాస్ చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా ప్రతి పాత్ర కూడా ఎప్పటికి గుర్తుండి పోయేలా ఉంది అనడంలో సందేహం లేదు. హీరోలకు పోటీ అన్నట్లుగా ఫిజిక్ లో మరియు లుక్ లో అదరగొడుతున్న అర్జున్ దాస్ త్వరలో ‘రసవాది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రసవాది సినిమా ప్రమోషన్ లో భాగంగా అర్జున్ దాస్ మాట్లాడుతూ.. దుబాయ్ లో పనిచేసే తాను డబ్బింగ్ ఆర్టిస్టుగా చెన్నై లో వచ్చి స్థిరపడ్డానని, లోకేష్ సర్ ‘ఖైదీ’ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన ఆ సమయంలో నా కెరీర్‌ ఇంతగా మలుపు తిరుగుతుందని నేను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చాడు.

లోకేష్ సార్ అడిగితే ఏదైనా చేస్తా?

ఈ క్రమంలో లోకేష్ కనగ రాజ్ గురించి అశ్శక్తికర వ్యాఖ్యలు చేసాడు అర్జున్ దాస్. ఇక రసవాది ప్రమోషన్ లో మాట్లాడుతూ ఖైదీ మరియు మాస్టర్ సినిమాల్లో నటించిన పాత్రలు నాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అందుకే చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌ అలాంటి పాత్రలను మరియు అలాంటి కథలను మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారు. కానీ నేను ఎక్కువ శాతం అలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం లేదని అన్నాడు. అలాగే తనకు లోకేష్ కనగరాజ్ అత్యంత ఆప్తుడని, ఒక వేళ మరోసారి లోకేష్ అలాంటి పాత్రను ఆఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓకే చెప్తానని, లోకేష్ చెప్పాలేగాని ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీగా ఉంటానని, హీరోగా ఎంత సక్సెస్ అయినా లోకేష్ అడిగితే విలన్ గా నటిస్తాను అన్నాడు.

హీరోగానూ వరుస సినిమాలు..

ఇక అర్జున్ దాస్ (Arjun Das) హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే పలు స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెన్స్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇక హీరోగా అర్జున్‌ దాస్ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి మంచి ఇమేజ్ ను తెచ్చి పెడతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఖచ్చితంగా ముందు ముందు హీరోగా కాకున్నా మంచి పాత్రల్లో అయితే అర్జున్‌ దాస్ ను చూస్తామని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్జున్ దాస్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” లో కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో గాని 2025 లో గాని రావచ్చు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు