Game Changer: నా కెరీర్ లో బెస్ట్ వర్క్ ఆ సినిమాకే చేస్తున్నా- థమన్

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లలో అందరికంటే ఎక్కువ బిజీ గా ఉన్నవారెవారంటే అది థమన్ అనే చెప్పాలి. ఈ డైరెక్టర్ చేతిలో దాదాపు అరడజను కి పైగా సినిమాలుండగా అవన్నీ కూడా తెలుగు సినిమాలే కావడం విశేషం. తాజాగా థమన్ మ్యూజిక్ అందించిన “బ్రో” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇక ఇప్పుడు థమన్ తన తదుపరి ప్రాజెక్ట్స్ లో మళ్ళీ బిజీ అవుతున్నాడు.

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో థమన్ తాను చేస్తున్న సినిమాల గురించి ప్రస్తావించాడు. అందులో గేమ్ ఛేంజర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడు.

అయితే థమన్ ఏ.ఆర్ రహమాన్ దగ్గర పనిచేసినప్పుడు శంకర్ తన బాయ్స్ సినిమాలో నటుడి వేషం ఇచ్చారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి తొలిసారిగా మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ థమన్ గేమ్ ఛేంజర్ కోసం తన కెరీర్ బెస్ట్ వర్క్ ఈ సినిమాకి చేస్తున్నానన్నాడు. ఇక ఈ సినిమాలో ఆరు కి పైగా పాటలుంటాయని, పాటలు కూడా ట్రిపుల్ ఎక్సల్ లార్జ్ సైజ్ లో పెద్దగా ఉంటాయన్నాడు.

- Advertisement -

మాములుగానే శంకర్ సినిమాల్లో పాటలు కూడా చాలా గ్రాండియర్ గా ఉంటాయని తెలిసిందే. పలు సినిమాల్లో పాట ద్వారానే సినిమా కాన్సెప్ట్ చెప్పడం శంకర్ స్పెషాలిటీ. అప్పట్లో ఒకే ఒక్కడు సినిమాలో వచ్చిన “మగధీర” సాంగ్ దీనికి ఉదాహరణ. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో కూడా అలాంటి పాటలుంటాయని అర్ధం చేసుకోవచ్చు. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంచనాలను థమన్ రీచ్ అవగలడా లేదా తెలియాలంటే సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేవరకైనా వెయిట్ చేయాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు