Nora fatehi New Movie: ఐటెం భామ కు అదిరిపోయే ఆఫర్

Nora fatehi New Movie

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏ అమ్మాయి కైనా తన మైండ్ లో ఏదో ఒక మూలాన హీరోయిన్ అవ్వాలని ఉంటుంది. కానీ అది అందరికి సాధ్యపడదు. దాంతో కెరీర్ గడవడానికి సినిమాలలో ఎదో ఒక క్యారెక్టర్ చేస్తూ.. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతారు. అయితే అందం కావాల్సినంత ఉండి, ఆఫర్లు లేని మరికొంత మంది మాత్రం ఐటెం గర్ల్ గా చేస్తుంటారు. ఈ కోవలోకి చెందిన బ్యూటీనే బాలీవుడ్ సుందరి నోరా ఫతేహి.

బాలీవుడ్ పలు బడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఈ భామను నిజానికి ఐటెం గర్ల్ మార్చి తొలి సక్సెస్ ఇచ్చింది టాలీవుడే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాలో “ఇట్టాగే రెచ్చిపోదాం” అనే పాటతోనే నోరా ఫతేహి ఐటెం గర్ల్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత బాహుబలి సినిమాలో ఈమె చేసిన మనోహరి సాంగ్ తో నోరా ఫతేహి బాగా పాపులర్ అయింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ గా ఉన్న ఈ బ్యూటీ రాబోయే ఒక భారీ బడ్జెట్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

వరుణ్ తేజ్ హీరోగా, పలాస మూవీ ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది. పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నోరా ఫతేహి ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మొహన్ చెరుకూరి నిర్మిచబోతున్న ఈ సినిమా ఈ నెల 27న అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. రంగస్థలం తరహాలో ఉండబోయే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు