Dear Comrade: నాలుగేళ్లు కామ్రేడ్

కొన్ని సినిమాల జాతకాలు ఎప్పటికి అర్ధం కావు. ఆ సినిమాలు చూస్తున్నంతసేపు బాగానే ఉన్నాయి అనిపిస్తాయి. మనకు ఇంకా బాగా నచ్చి మనలని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోతాయి. ఇది ఒక కల్ట్ సినిమా అని అభిప్రాయానికి మనం వచ్చినప్పుడు. అది బాక్సాఫిస్ వద్ద ఒక డిజాస్టర్ గానే మిగిలిపోతుంది. అలాంటి సినిమాల జాబితాలో ఖలేజా , జోష్, ఆరంజ్ , తీన్మార్ వంటి సినిమాలు వస్తాయి. అలానే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ కూడా. నేటికీ ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు అయింది.

విజయ్ దేవరకొండ & రష్మిక మందాన జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అలానే అప్పటికి అర్జున్ రెడ్డి , టాక్సీ వాలా , గీత గోవిందం వంటి సినిమాలు విజయ్ కి ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా పరంగా చూడటానికి బాగానే ఉన్న అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

డియర్ కామ్రేడ్ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టరైజేషన్, అలానే లిల్లీ క్యారెక్టరైజేషన్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. వీటన్నిటిని మించి ఈ సినిమా మ్యూజిక్ ఒక థెరపీ. ఇప్పటికి ఈ పాటలు విన్న మంచి ఫీల్ వస్తుంది. అంత అద్భుతమైన మ్యూజిక్ అందించాడు జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు. బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపర్చిన, చాలామంది మనసులకు హత్తుకున్న ఈ సినిమాకి నేటితో నాలుగేళ్లు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు