Nee Jathai: ఆ హీరోతో రొమాంటిక్ జర్నీ చేస్తున్న ఏజెంట్ భామ!

Sakshi Vaidya About Nee Jathai Song

టాలీవుడ్ లో ఎన్నో ఆశలతో ముంబై నుండి ఏజెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “సాక్షి వైద్య”. అయితే మొదటి సినిమాతోనే డిజాస్టర్ రావడంతో కెరీర్ మొదట్లోనే కోలుకోలేని దెబ్బ పడింది. అయినా తెలుగులో గ్లామర్ హీరోయిన్లకు ప్లాప్స్ వచ్చినా అవకాశాలు రావడం మామూలే. అందుకే ఏజెంట్ సినిమా రిలీజ్ కాకముందే ఈ అమ్మడికి ఇతర సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అలా వచ్చిందే “గాండీవధారి అర్జున” సినిమా.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా “స్పై” జోనర్ లో రూపొందిన యాక్షన్ సినిమా. అయితే సాక్షి నటించిన మొదటి సినిమా ఏజెంట్ కూడా స్పై జోనర్ లో వచ్చిన సినిమాయే కావడం విశేషం. గాండీవ ధారి అర్జున సినిమాకి సంబంధించి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ పాట హీరో, హీరోయిన్ల మధ్య సాగే ఒక ట్రావెలింగ్ ట్రిప్ సాంగ్ గా ఉంది. దీనిపై హీరోయిన్ సాక్షి స్పందిస్తూ, హీరోతో కలిసి చేసిన ఈ సాంగ్ ఒక రొమాంటిక్ జర్నీ సాంగ్ గా ఆడియన్స్ ని అలరిస్తుంది అని ట్వీట్ చేసింది.

ఇక “నీ జతై” అనే పేరుతో రిలీజ్ అయిన ఈ పాట కూల్ గా ఉండి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మిక్కీ జె మేయర్ తన గత చిత్రాల్లో లాగానే ఈ సినిమాకి ఫ్రెష్ మెలోడీ ట్యూన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో సాక్షి స్పై టీమ్ లో ఒక ఆఫీసర్ గా నటించగా, వరుణ్ తేజ్ అర్జున్ కుమార్ గా స్పై ఏజెంట్ గా నటించాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిపోగా ఆగష్టు 25న గాండీవధారి అర్జున రిలీజ్ కి రెడీ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు