Director Mallik Ram : 100 కోట్ల మూవీ ఇచ్చినా టిల్లు డైరెక్టర్ ను పట్టించుకోని స్టార్స్… నెక్స్ట్ ఏంటి?

Director Mallik Ram : డైరెక్టర్ మల్లిక్ రామ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మార్మొగిపోతోంది. ఆయన కెరీర్ టిల్లు స్క్వేర్ కు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. అయితే సిద్దు జొన్నలగడ్డకు 100 కోట్ల మూవీని ఇచ్చినప్పటికీ ఈ డైరెక్టర్ వైపు టాలీవుడ్ హీరోలు కన్నెత్తి చూడకపోవడం విచారకరం. బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన టిల్లు డైరెక్టర్ ని టాలీవుడ్ హీరోలు అస్సలు పట్టించుకోవట్లేదు. దీంతో ఈ డైరెక్టర్ విషయంలో నెక్స్ట్ ఏంటి అనే సందేహం నెలకొంది టాలీవుడ్ మూవీ లవర్స్ కి.

క్రెడిట్ అంతా సిద్ధుకే..

టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయ్యేదాకా డైరెక్టర్ మల్లిక్ రాంమ్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా తెలియదనే చెప్పాలి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మార్చ్ 29న థియేటర్లలోకి వచ్చింది. అంతకంటే ముందే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డీజే మూవీకి టిల్లు స్క్వేర్ సీక్వెల్ గా వచ్చింది. ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి వారంలోని సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకోవడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. కానీ ఇల్లు స్క్వేర్ మూవీ థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు నెలల కావస్తున్నా ఇప్పటిదాకా ఆయన నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ లేదు. ఎందుకంటే ఈ మూవీ క్రెడిట్ మొత్తం హీరోగా నటించిన సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో పడిపోయింది.

మళ్లీ అదే బ్యానర్ లో..

నిజానికి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మోగించిన మోతకి డైరెక్టర్ మల్లిక్ రామ్ కి స్టార్ హీరోల నుంచి పిలుపు వస్తుందని సినీ విశ్లేషకులు భావించారు. కానీ ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. స్టార్ హీరోల నుంచి మిడ్ రేంజ్ హీరోలు కూడా ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలోనే మల్లిక్ రామ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే తన నెక్స్ట్ మూవీని చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.

- Advertisement -

మల్లిక్ రామ్ సినిమాలు…

2016లో మల్లిక్ రామ్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హిందీలో హిట్ అయిన విక్కీ డోనర్ సినిమాకి తెలుగు రీమేక్ గా నరుడా డోనరుడా పేరుతో ఫస్ట్ మూవీని తెరకెక్కించారు. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా అద్భుతం అనే మూవీని చేశారు. డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత డిజె టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. తనపై నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదాయన. మరి డైరెక్టర్ మల్లిక్ రామ్ నెక్స్ట్ సినిమా ఏంటో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు