Ramayanam: మొదటి భాగానికే రూ.835 కోట్లు.. భారీ హైప్స్..!

Ramayanam.. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా చిత్రాలనే తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే వాటి బడ్జెట్లు కూడా పెరిగిపోతున్నాయి.. పైగా ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తూ భారీగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇకపోతే కొంతమంది నిర్మాతలు, నటీనటులు , దర్శకులు, ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి తెగ కష్టపడి పోతున్నారనటంలో సందేహం లేదు.. దాంతో భారతీయ సినిమా పరిధి కూడా భారీగా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అలాగే బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది.. ఈ క్రమంలోనే ఒక సినిమా విషయంలో అందులోను రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఆ సినిమా మొదటి భాగానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రామాయణం – పార్ట్ 1 బడ్జెట్ రూ.835 కోట్లు..

Ramayanam: Rs.835 crores for the first part.. Huge hypes..!
Ramayanam: Rs.835 crores for the first part.. Huge hypes..!

ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న చిత్రం రామాయణం. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది.. ఇప్పుడు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారడం గమనార్హం. ఈ చిత్రాన్ని నమిత మల్హోత్రా నిర్మిస్తూ ఉండగా..కన్నడ స్టార్ హీరో యష్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.835 కోట్లు అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా… ఆర్టిస్టులను కూడా దాదాపుగా సెలెక్ట్ చేస్తున్నారని సమాచారం.. ఇకపోతే మొదటి భాగానికే ఇంత బడ్జెట్ అని తెలిసి సినిమా ఇండస్ట్రీలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

బడ్జెట్ విషయంపై క్లారిటీ..

ఇకపోతే రామాయణం ఇతిహాస గాధ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్ నటిస్తున్నట్లు సమాచారం.. ఇక ఆర్టిస్టుల రెమ్యునరేషన్, సెట్ ల నిర్మాణం , గ్రాఫిక్స్ వర్క్ ఇలా అన్నీ కలిపి సుమారుగా రూ . 835 కోట్ల వరకు చేరిందని తెలుస్తోంది..ఇదిలా ఉండగా మరోవైపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో 2022లో విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ఇప్పటివరకు బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో కూడా రణబీర్ కపూర్ హీరోగా ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటించారు.. ఇక ఇప్పుడు రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం మొదటి భాగం బడ్జెట్ రూ.835 కోట్లు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అన్నది తెలియాలి. నిజానికి రామాయణం సినిమా మొదటి భాగానికే రూ.835 కోట్లు కేటాయిస్తున్నారా లేక రెండు భాగాలకు కలిపి ఇంత బడ్జెట్ పెడుతున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇకపోతే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం దాదాపు 600 రోజులు కేటాయిస్తున్నారు. ఇక రామాయణ కథను అద్భుత దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కూడా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇందులోని పాత్రలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు