Tollywood : ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..!

Tollywood : తెలుగు రాష్ట్రాల్లో నిన్న మే 13న ఎన్నికల వోటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎలెక్షన్లు ఒకేసారి జరగగా, తెలంగాణ లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగా, ఎంపీ ఎన్నికల వోటింగ్ ఇప్పుడు జరిగింది. గత కొన్ని నెలలుగా వివిధ పార్టీల రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం చేయగా, నిన్న ఫైనల్ గా అనగా మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ లో కూడా పలు రాష్ట్రాలలో ఎన్నికల ఓటింగ్ జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ హడావిడే జరిగినట్లు తెలుస్తుంది. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు ఎన్నికల బరిలో నిల్చోగా, పవన్ కళ్యాణ్ జనసేన తరపున, బాలకృష్ణ టిడిపి తరపున అలాగే మరికొందరు నటీనటులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఎన్నికల నేపథ్యంలో పలువురు (Tollywood) సినీ సెలెబ్రిటీలు నిన్న ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వారిలో దాదాపు బడా స్టార్లు చాలా వరకు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.

ఓట్ వేసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు..

ఇక నిన్న జరిగిన ఎన్నికల వోటింగ్ లో టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్టార్లు తమ ఓటును వేయడం జరిగింది. చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, రాజమౌళి, సుధీర్ బాబు, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, అనన్య నాగళ్ళ, చాందిని చౌదరి, మోహన్ బాబు, రాఘవేంద్ర రావు, జీవిత రాజ శేఖర్, కిరణ్ అబ్బవరం లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా, డైరెక్టర్లు వైవిఎస్ చౌదరి, గోపీచంద్ మలినేని తదితరులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

List of Tollywood celebrities who could not vote

- Advertisement -

ఓటు వేయలేకపోయిన సినీ ప్రముఖులు..

అయితే పలువురు తెలుగు బడా స్టార్లు కూడా అనివార్య కారణాల వల్ల మే 13న తమ ఓటుని వేయలేకపోయారు. వారిలో హీరోల నుండి దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా ప్రొడక్షన్ వర్క్ లో ఉండి ఓటు వేయలేదని టాక్. అలాగే నాగార్జున జూబ్లీహిల్స్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో ఓటు వేయడానికి రావాల్సింది కానీ రాలేదు. అలాగే జూబ్లీహిల్స్ ఆర్హిక సహకార సంస్థలో అల్లరి నరేష్ తన ఓటుని వేయడానికి వెళ్ళలేదు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని రామ్ పోతినేని ఓట్ వేయలేదు. ఇక మంచు ఫ్యామిలీ లో మనోజ్ తప్ప అందరూ ఓటు వేయడం జరిగింది. ఇక మెగా ఫ్యామిలీ లో కూడా అందరూ ఆల్మోస్ట్ ఓట్ వేయగా వరుణ్ తేజ్ ఓట్ వేయడం మిస్ అయ్యాడు. వీళ్ళతో పాటు జగపతిబాబు, రవితేజ, దర్శకులు సురేందర్ రెడ్డి, సుకుమార్ అలాగే పలువురు నిర్మాతలు టెక్నిషియన్స్ తమ వోటుని వేయలేదని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు