Tamannah : తమన్నాకు వింత అలవాటు… 8 దాటితే ఆ పని మాత్రం చేయదట

Tamannah : సాధారణంగా మనుషులందరికీ ఏదో ఒక వింత అలవాటు ఉంటుంది. అలాగే సెలబ్రిటీల విషయంలో కూడా జరుగుతుంది. తాజాగా తమన్నా తనకి ఓ వింత హ్యాబిట్ ఉంది అనే విషయాన్ని వెల్లడించింది. మరి ఇంతకీ తమన్నాకు ఉన్న ఆ అలవాటు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

తమన్నా బ్యాడ్ హ్యాబిట్

మిల్కీ బ్యూటీ తమన్నా వెండితెరపై గ్లామరస్ ట్రీట్ తో అదరగొడుతూనే ఓటిటి లో కూడా సందడి చేస్తోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ దశాబ్దానికి పైగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. తెలుగులో హ్యాపీడేస్, 100% లవ్, ఆగడు, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమన్నా టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. తెలుగుతో పాటే తమిళ, కన్నడ,  హిందీ భాషల్లోనూ నటించి ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారి భారీ పారితోషికాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తమన్నా తాజాగా తనకున్న విచిత్రమైన అలవాటును బయట పెట్టేసింది.

సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టగా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక విషయంలోకి వెళితే.. తాజాగా తమన్నా తనకు బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

తమన్నాను కాలవాలంటే ఇవి మస్ట్

ఎవరైనా తనను కలవాలి అనుకున్నప్పుడు తమన్నా ఎక్కువగా ఫోకస్ చేసేది ప్లేస్, ఫుడ్ పైనేనట. ఇక ఈ బ్యూటీ తను దేనికైనా రెడీగా ఉంటానని అందరికీ చెప్తుందట. కానీ నిజానికి ఈ మిల్కీ బ్యూటీకి రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడికి వెళ్లడం అన్నా, ఏదైనా పనిని చేయాలి అన్నా కూడా అస్సలు నచ్చదట. మొత్తానికి మిల్కీ బ్యూటీ హ్యాబిట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

కాగా తమన్నా రీసెంట్ గా బాక్ అనే సినిమాలో నటించి మెప్పించింది. తమిళంలో ఈ మూవీ అరణ్మనై అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి హిట్ గా నిలిచింది. తెలుగులో మాత్రం ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీలో రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటించింది. సుందర్ సి దర్శకత్వంలో బాక్ మూవీ రూపొందింది.

బాలీవుడ్ లోనే తమన్నా మకాం

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే తమన్నా ఇప్పుడు ముంబైలోనే ఉంటుంది. మరోవైపు విజయ్ వర్మ అనే బాలీవుడ్ నటుడితో తమన్నా డేటింగ్ గురించి ఎప్పటికప్పుడు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. కానీ ఇంకా ఈ విషయంపై తమన్నా, విజయ్ వర్మ స్పందించలేదు. వీళ్ళ పెళ్లి కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు