Tabu: హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన టబు!

Tabu returns to Hollywood after 12 years: సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది టబు. అయితే ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తోంది. ఏజ్ పైబడటంతో… చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కాలం గడిపేస్తోంది టబు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ… బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయింది. వాస్తావానికి ఈ బ్యూటీ ముస్లిం కుటుంబంలో పుట్టింది.

అయితే ఈ బ్యూటీ 1991 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సంవత్సరంలో కూలి నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్గా నటించి.. బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టబు. ఆ తరువాత సిసింద్రీ, నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడ, లాంటి సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో… అల్లు అర్జున్ చేసిన అలా వైకుంఠపురం సినిమాలో ఒకేలక పాత్రలో కనిపించింది టబు.

అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నటి టబుకు తాజాగా అదిరిపోయే ఆఫర్ వచ్చింది. హాలీవుడ్ లో చేసే ఆఫర్ తాజాగా టబుకు వచ్చింది. డ్యూన్ పార్ట్ 3 సిరీస్ లో ఈ బ్యూటీ కి అవకాశం దక్కింది. ఇందులో ఓ పోలీస్ పాత్ర నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ డేనిస్ దర్శకత్వంలో రాగా… ఇప్పటికే వచ్చినా రెండు భాగాలు బంపర్ హిట్ అందుకున్నాయి. ఇప్పుడు వచ్చేది మూడవ పార్ట్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు