Suchitra: ధనుష్ – ఐశ్వర్య విడాకులపై సుచిత్ర షాకింగ్ కామెంట్స్..!

Suchitra.. సుచిత్ర గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. సుచీ లీక్స్ పేరిట అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2017లో తమిళ్ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందంటూ తెలిపింది. అలాగే ధనుష్ అసిస్టెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ముఖ్యంగా తమిళ సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ధనుష్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురి చేశారు అంటూ ఈమె చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.. అయితే ఇప్పుడు తాజాగా ధనుష్ ఐశ్వర్య విడిపోవడానికి గల కారణాన్ని చెబుతూ ఆశ్చర్యాన్ని కలిగించింది..

నటుడు ధనుష్ , లేడీ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు అనుకోకుండా విడాకులు ప్రకటించి.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.. అయితే ఎందుకు వీరిద్దరూ విడిపోతున్నారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఎక్కడ కూడా తమ విడాకుల గురించి స్పందించలేదు.. కానీ ఇప్పుడు తాజాగా తమిళ రేడియో జాకి గాయని సుచిత్ర కార్తీక్ మాత్రం పెద్ద బాంబు పేల్చింది.. ధనుష్ మరో అమ్మాయి తో సంబంధం పెట్టుకోవడం వల్లే ఐశ్వర్య అతడి నుంచి విడిపోయింది అంటూ కామెంట్లు చేసింది..

ఐశ్వర్య – ధనుష్ విడాకులపై సుచిత్ర కామెంట్స్..

Suchitra: Suchitra's Shocking comments on Dhanush - Aishwarya's divorce..!
Suchitra: Suchitra’s Shocking comments on Dhanush – Aishwarya’s divorce..!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.. ధనుష్ – ఐశ్వర్యాల విడాకులపై ఆమె స్పందిస్తూ.. ధనుష్ , ఐశ్వర్య ఒకరికొకరు మోసం చేసుకున్నారు.. నాకు ధనుష్ మీద చాలా కోపం వచ్చింది.. నేను మరో కోణంలో మరో విధంగా నేను చూస్తాను.. రీల్స్ చేసే తల్లులంటే నాకు ఇష్టం ఉండదు.. ధనుష్ ఒక మంచి తండ్రి.. కానీ ఐశ్వర్య మంచి తల్లి కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. పెళ్లయ్యాక ఎవరైనా డేట్ కి వెళ్తారా? కానీ ధనుష్ మాత్రం ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు.. అలా ఐశ్వర్య ను మోసం చేస్తున్నాడు. ధనుష్ స్వలింగ సంపర్కుడు అలాగే డ్రగ్స్ వాడే వాడు అంటూ ఆమె ఆరోపణలు చేసింది .

- Advertisement -

ధనుష్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్..

ఇకపోతే ఈ విషయంపై ధనుష్ , రజనీకాంత్ అభిమానులు సుచిత్రపై కామెంట్ చేస్తున్నారు. ఆమెను పెద్ద ఎత్తున విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు కూడా.. ఇకపోతే ఆమె మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదని కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.. ఇకపోతే గతంలో సుచిత్ర భర్త కూడా సుచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పాడు దీంతో ఈ కామెంట్లు ఇప్పుడు మళ్లీ చర్చకు దారితీసాయి.. మొత్తానికి అయితే ఐశ్వర్య ధనుష్ మధ్య లేనిపోనివి సృష్టిస్తోంది అంటూ రజనీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిపై సుచిత్ర ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి..

స్టార్ సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు వైరల్..

ఇకపోతే ఈ సుచిత్ర లీక్స్ గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ పై కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్ , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అలాగే ఆండ్రియా జరేమియా, త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఈమె ట్విట్టర్ ఖాతాలో కనిపించాయి..ఇవన్నీ కూడా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు