Dayaa: సినిమా సక్సెస్ రాకపోయినా ఓటిటి తో సక్సెస్ కొట్టిన హీరోయిన్

Esha Rebba OTT Movie Daya Super Success

టాలీవుడ్ లో సైడ్ రోల్స్ తో కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా సినిమాలు చేసిన అమ్మాయి ఈషా రెబ్బ. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈషా మొదట్లో చిన్న సినిమాల్లో మంచి ఆఫర్లు అందుకుంది. కొన్ని హిట్స్ కూడా దక్కాయి. కానీ ఏ హీరోయిన్ కి అయినా ఒక బ్లాక్ బస్టర్ అయినా లేకపోతే తెలుగులో కెరీర్ నిలదొక్కుకోవడం కష్టం. ఈ అమ్మాయి కెరీర్ కూడా అలాంటిదే. కెరీర్ లో బ్రాండ్ బాబు తర్వాత మరో హిట్ లేదు ఈషా కి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ కి పరిమితమైంది.

ఇలా కొన్ని ప్రత్యేక పాత్రలతో నెట్టుకొస్తోంది ఈషా. అయితే ఈ ఇయర్ మాత్రం వరుస ఆఫర్లు అందుకుంది. అయితే అందులో రెండు సినిమాలు, రెండు వెబ్ సీరీస్ లు ఉండడం గమనార్హం. కానీ ఆ సినిమాలు రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. అందులో ఒకటి తమిళ్ సినిమా కాగా, మరొకటి సుధీర్ బాబు నటిస్తున్న “మామా మశ్చీంద్ర” మూవీ ఒకటి. అయితే ఈషా రెబ్బ నటించిన చిత్రాలు రిలీజ్ కాకపొయిటినా, తాను నటించిన వెబ్ సిరీస్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది.

తాజాగా ఈషా రెబ్బ హీరోయిన్ గా జేడీ. చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన “దయా” అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, ఓటిటి లో సాలిడ్ వ్యూస్ ని దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈషా ఈ వెబ్ సిరీస్ తో మళ్ళీ ఫేమ్ తెచ్చుకుంది అనే చెప్పాలి. అయితే సినిమా ఆఫర్లు మళ్ళీ వస్తాయా అనుకుంటే డౌటే. ఎందుకంటే సినిమా సినిమాయే, ఓటిటి ఓటిటియే. మరి ముందు ముందైనా ఈ అమ్మడి టాలెంట్ చూసి ఎవరైనా డైరెక్టర్లు కనికరిస్తారేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు