Dayaa: సినిమాలు రాకపోయినా, ఓటిటి ఛాన్సులొస్తునే ఉన్నాయిగా?

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లో చెప్పుకోదగ్గ హీరోయిన్లలో ముందు వరుసలో ఉండేది ఇషా రెబ్బ. చిన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన ఈ భామ అమితుమీ, బ్రాండ్ బాబు వంటి చిత్రాలతో హిట్స్ కొట్టినా పెద్ద సినిమాల్లో ఆఫర్లు అయితే రాలేదు. కానీ అడపాదడపా ఇతర భాషల్లో మూవీ ఆఫర్లు వచ్చాయి. అయినా అక్కడ ఒరిగిందేమి లేదు. చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది.

అయితే ఇషా రెబ్బ తెలుగుకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు అయితే రావడంలేదు. వచ్చిన మూవీస్ కూడా పెద్ద సినిమా అయితే చిన్న పాత్ర, చిన్న సినిమా అయితే యాక్టింగ్ స్కోప్ లేని రోల్స్ వస్తున్నాయి. అయితే సినిమాల్లో ఆఫర్లు తక్కువవుతున్నా ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ ల ఛాన్స్ లు మాత్రం బాగా వస్తున్నాయి. ఇప్పటికే 3రొసెస్, పిట్ట కథలు వంటి వెబ్ సిరీస్ లో నటించిన ఇషా, తాజాగా “మాయాబజార్ ఫర్ సేల్” అనే కామెడీ వెబ్ సిరీస్ లో నటించింది. జీ 5లో ప్రసారమవుతున్న ఆ సిరీస్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక తాజాగా మరో వెబ్ సిరీస్ ద్వారా వస్తుంది ఇషా రెబ్బ. జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన “దయా” అనే వెబ్ సిరీస్ లో ఇషా ఫిమేల్ లీడ్ గా నటించింది. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ ఆగష్టు 4 నుండి హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఇక సినిమా ఛాన్సులు పెద్దగా రాకపోయినా ఓటిటి ఆఫర్లతో కుమ్మేస్తుంది ఇస్హారెబ్బ. ప్రస్తుతం మామ మశ్చింద్ర అనే చిత్రంలో నటిస్తున్న ఇషా ఆహా ఓటిటి నుండి మరో వెబ్ సిరీస్ ఆఫర్ అందుకుంది టాక్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు