Pooja Hegde: ఐరన్ లెగ్ బ్యూటీకి మళ్లీ గోల్డెన్ డేస్ ?

భాషతో సంబంధం లేదు.. ఏ ఇండస్ట్రీలో అయినా, ఐరన్ లెగ్ అంటే.. వెంటనే గుర్తు వచ్చే పేరు పూజా హెగ్డే. దాదాపు అన్ని భాషల్లో తనను తాను ఐరన్ లెగ్ అని ప్రూఫ్ చేసుకుంది ఈ బుట్టబొమ్మ. దీంతో అవకాశాలు రోజు రోజుకు సన్నగిల్లాయి. చేతిలో ఉన్నాయి అని అనుకున్న ప్రాజెక్ట్ లు కూడా జారిపోయాయి. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీల నుంచి పూజా హెగ్డేను తప్పించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీని తర్వాత పూజా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఇండస్ట్రీలో పూజా పని అయిపోయిందని, కెరీర్ ముగిసిపోయిందని అందరూ అంచనా వేశారు. కానీ, తాజా పరిస్థితులు చూస్తే, ఐరన్ లెగ్ బ్యూటీకి మళ్లీ గోల్డెన్ డేస్ వచ్చినట్టు తెలుస్తుంది. వరుసగా అవకాశాలను అందుకుంటుంది. గత కొన్ని రోజుల నుంచి పూజా హెగ్డేతో పలువురు దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ న్యూస్ ప్రస్తుతం పూజా హెగ్డే ఫ్యాన్స్ కు ఊరటనిస్తుంది. మాస్ మహరాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను ఫైనల్ చేశారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

- Advertisement -

అలాగే కోలీవుడ్ స్టార్ కార్తీతో లింగు స్వామి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. దీంతో పాటు మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబోలో రాబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

ఇలా ఐరన్ లెగ్ పూజా హెగ్డే చేతి నిండా సినిమాలతో మళ్లీ గోల్డెన్ డేస్ ను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూడు సినిమాలు మంచి ఫలితాన్ని ఇస్తే, ఆ గోల్డెన్ డేస్ రావడం గ్యారంటీ.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు