Mehreen: ఇక్కడ ఛాన్సులు రావట్లేదని అక్కడికెళ్ళిందా?

Mehreen Kannada Movie

టాలీవుడ్ లో క్యూట్ గా హీరోయిన్లలో మెహ్రిన్ పిర్జాదా ముందు ప్లేస్ లో ఉంటుంది. ఫస్ట్ సినిమాతోనే చాలా మంది క్రష్ లిస్ట్ లలో జాయిన్ అయింది ఈ భామ. ఆ తర్వాత వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. చూడ్డానికి కాజల్ డూప్ లా కూడా అనిపించడంతో మొదట్లో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఎక్కువగా చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాల్లోనే ఛాన్సులు వచ్చేవి. క్రమంగా వరుస బెట్టి సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఈ అమ్మడి క్రేజ్ డౌన్ అవుతూ వచ్చింది.

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసింది. అయినా ఈ అమ్మడి ఫేట్ మారలేదు. ఇక చివరగా F3 సినిమా చేసిన మెహ్రిన్ ఆ సినిమా యావరేజ్ గా ఆడడంతో ఆఫర్లు కూడా కనుమరుగయ్యాయి. మూవీ ఛాన్సులకోసం చాలా రోజులు వెయిట్ చేసింది ఈ భామ. చివరగా ఏదో స్పార్క్ అనే చిన్న సినిమా చేసింది. యేడాది పాటు నిరీక్షించిన మెహ్రిన్ కి కన్నడ లో ఛాన్స్ వచ్చింది. “నీ సిగెవరెగు” అనే కన్నడ సినిమాలో మెహ్రిన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఆ సినిమాలో హీరో శివరాజ్ కుమార్ కావడం మెహ్రిన్ కి కలిసొస్తుంది.

ఎందుకంటే కన్నడలో ఫస్ట్ సినిమా లోనే స్టార్ హీరోతో కలిసి నటిస్తుందంటే ఆ సినిమా హిట్ అయితే కన్నడలో చక్రం మెహ్రిన్ చక్రం తిప్పే అవకాశం ఉంది. గతంలో శాన్వి, కృతి కర్బందా లాంటి హీరోయిన్లు కూడా తెలుగులో చేసి ఆ తర్వాత కన్నడలో క్లిక్ అయ్యారు. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లు అయ్యారు. మరి మెహ్రిన్ కూడా ఆ జాబితాలోకి చేరుతుందా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు