F3: ఈ హీరోయిన్ కెరీర్ ముగింపు దశకు వచ్చినట్టేనా?

టాలీవుడ్ లో మెహ్రిన్ హవా అయిపోయినట్టేనా? ఈ అమ్మడికి ఇక ఛాన్సులు రావా? ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ సుందరి సినిమాల్లో కనిపించి దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పటివరకు మెహ్రిన్ జాడే లేదు. పంజాబ్ కి చెందిన “మెహ్రిన్ పిర్జాద” “కృష్ణ గాడి వీర ప్రేమగాథ” సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. చూడ్డానికి కాజల్ డూప్ లాగా ఉండే ఈ అమ్మాయి మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకోవడమే గాక, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత రాజా ది గ్రేట్, మహానుభావుడు సినిమాలతో హ్యాట్ట్రిక్ హిట్ అందుకొని టాలీవుడ్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.

అయితే వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ భామ స్క్రిప్ట్ గురించి ఆలోచించకుండా అన్ని రకాల సినిమాలు చేసింది. కానీ ఒక్కటీ హిట్ కాలేదు. ఫలితంగా గోల్డెన్ లెగ్ ట్యాగ్ పోయి ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చి పడింది. మధ్యలో ఎఫ్2 లాంటి సినిమాలు హిట్ అయినా దాని వల్ల మెహ్రిన్ కి వచ్చిన లాభమేమి లేదు. ఇక చివరగా ఎఫ్3 సీక్వెల్ లో నటించిన ఈ భామ మళ్ళీ ఇప్పటివరకు కనిపించలేదు. ఇక దాదాపుగా మెహ్రిన్ కి టాలీవుడ్ లో ఛాన్సులు రానట్టే చెప్పాలి. ఒకవేళ దగ్గరిదాకా వస్తున్నా అవి కొత్త హీరోయిన్లు లాగేసుకుంటున్నారు. దీనితో ఈ హీరోయిన్ కెరీర్ డైలెమా లో పడింది.

మెహ్రిన్ కి ఛాన్సులు రావట్లేదంటే ఒక రకంగా తన తప్పే అని చెప్పాలి. కెరీర్ మొదట్నుంచి గ్లామర్ రోల్స్  సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ హీరోయిన్ కి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలు రాలేదు. అందువల్ల ఆడియన్స్ కి మెహ్రిన్ కూడా రొటీన్ అయిపొయింది. ఇది గమనించిన డైరెక్టర్లు పాత్రలు ఇవ్వడం లేదు. మరి వేరే భాషల్లో ఏమైనా సినిమాలు చేస్తుందా అంటే అదీ లేదు. మరి టాలీవుడ్ లో కెరీర్ అయిపోయినట్టేనా అంటే బహుశా సగం వరకు చెప్పొచ్చు. సెకండ్ లీడ్ లాంటివి వస్తే రావొచ్చు. అయినా సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది ఈ భామ. మరి ఏ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయినా మెహ్రిన్ ని ఆదుకుంటాడేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు