NBK109: రకుల్ కి ఇక తప్పదా? సీనియర్లే దిక్కా?

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా వెళ్లిన ఈ భామ ఇప్ప్పుడు ఒక్క ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. బాలీవుడ్ పై మోజుతో నెత్తిన పెట్టుకున్న టాలీవుడ్ ని కాదని, ఇక్కడ వస్తున్న ఆఫర్స్ ని రిజెక్ట్ చేసి మరీ వెళ్ళింది. అయితే అక్కడ సినిమాలు ప్లాప్ అవుతుండడం తో మళ్ళీ టాలీవుడ్ కి రావాలని చూస్తుంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరి తోను జత కట్టిన ఈ భామ ఇప్పుడు సీనియర్ హీరోలతో చేసేందుకు సిద్ధం అవుతుంది.

అసలు విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు ఆఫర్లు కరువయ్యాయి. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్లు ఆల్రెడీ బుక్ అయ్యారు. పైగా శ్రీ లీల, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు యంగ్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ పోటీ ఇస్తున్నారు. కాబట్టి సీనియర్ అయిన రకుల్ కి వచ్చే రావాల్సిన ఛాన్సులు కూడా కొత్త హీరోయిన్లు ఎగరేసుకుపోతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ భామ ఏ హీరోతోనైనా సరే నటించడానికి సిద్ధంగా ఉందని సమాచారం.

తాజాగా బాలకృష్ణ 109 వ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందని సమాచారం అందింది. సితార ఎంటరైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తుండగా, బాబీ తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇటీవల గ్రాండ్ గా ఓపెనింగ్ జరగగా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు లో స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం బాలయ్య “భగవంత్ కేసరి” షూటింగ్ లో బిజీ గా ఉండగా, ఈ సినిమా పూర్తయ్యాకే బాబీ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడు.

- Advertisement -

ఇక నిర్మాత నాగవంశీ రీసెంట్ గా రకుల్ ని సంప్రదించి ఈ సినిమాలో ఓకే చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా తనకు అడ్వాన్సు కూడా ఇచ్చారని టాక్. అయితే చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ గా సమాచారం అయితే రాలేదు. కానీ ఈ ఆఫర్ వల్ల రకుల్ కి ఒరిగేదేమి లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కసారి సీనియర్లతో నటించాక యంగ్ హీరోలతో ఛాన్సులు రావడం చాలా కష్టం. అయినా ఇప్పుడు యంగ్ హీరోలు చిన్న హీరోలు కూడా కొత్త హీరోయిన్లకే మొగ్గు చూపుతుండడం వల్ల రకుల్ ప్రీత్ కి సీనియర్లే దిక్కయ్యారని చెప్పవచ్చు.

ఇక రకుల్ ప్రీత్ ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోలైన నాగార్జున, రవితేజల తో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 లోను నటిస్తుంది. ఇప్పుడు బాలయ్య తో సినిమా అంటున్నారు. ఇలా అయితే ఇక టాప్ హీరోలతో సినిమా ఛాన్సులు లేనట్టే అని చెప్పాలి. మరి బాలయ్య తో నటిస్తుంది నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాలి. ప్రస్తుతం రకుల్ తెలుగులో ఏ సినిమాలోను నటించడం లేదు. మరి NBK109 ఆఫర్ రావడం నిజమే అయితే రకుల్ కెరీర్ ఎటు వెళ్తుందో చెప్పడం కష్టం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు