Bhola Shankar: కీర్తి కోసం ఆమె పాత్రను తగ్గించారా?

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వం లో నటించిన భోళా శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తవగా మిగిలిన పార్ట్ ని కూడా త్వరలోనే పూర్తి చేస్తారని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందింది. ఇక ఈ సినిమా తమిళ హిట్ వేదాళం కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించగా. చిరు కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రలో నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది.

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి గా నటించిన కీర్తి సురేష్ పాత్ర హైలెట్ అవ్వనుందట. ఒరిజినల్ కథలో కూడా కాన్సెప్ట్ అన్నాచెల్లెలిదే అయినా ఆ సినిమాలో హీరోయిన్ కి ఇవ్వాల్సింది ఇచ్చేసారు. కానీ తెలుగు వెర్షన్ లో చెల్లి పాత్రని పెంచడానికి హీరోయిన్ తమన్నా పాత్రని తగ్గించారని రూమర్స్ వినబడుతున్నాయి. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ఈ సినిమాలో కొంచెం ఎక్కువ చేసారని అంటున్నారు. అంతే కాక తమన్నా చిరంజీవి పక్కన అంతగా సూట్ కాదని చాలా మంది అభిప్రాయం.

ఇది తెలుసుకున్న డైరెక్టర్ మెహర్ రమేష్ తమన్నా చిరంజీవి తో ఎక్కువ సీన్లు, రొమాంటిక్ సీన్లు లేకుండా జాగ్రత్త పడుతూన్నారని టాక్. అదీగాక రీసెంట్ గా వచ్చిన టీజర్ లో తమన్నా ఒక్క షాట్ లోనే కనిపిస్తే, కీర్తి రెండు మూడు కట్స్ లో కనిపించింది.

- Advertisement -

మరి బయట వినబడుతున్న ఈ రూమర్స్ నిజమోకాదో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాలి. ఇక ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన పార్ట్ అంతా షూట్ అయిపోగా, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగష్టు 11 న విడుదలకు సిద్ధం అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు