Swetha Pvs: మైక్ నుంచి మెగాఫోన్ కి

Swetha Pvs: శ్వేత పీవియస్ ఈమె అందరికి తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియా వాడుతున్న చాలామంది యూత్ కి ఈమె పరిచయం. ఇంస్టాగ్రామ్ లో ఈమె వీడియోస్ ను ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. చాలామందిని మోటివేట్ చేయడంలో పీవీఎస్ శ్వేత కీలక పాత్ర వహిస్తుంది అని చెప్పొచ్చు. శ్వేత చేసిన వీడియోస్ అన్నీ కూడా తమ కోసమే చేశారు అని ఎవరికి వారు ఫీలయ్యేటట్లు ఉంటాయి అని చెప్పొచ్చు.

ఇకపోతే శ్వేతా విషయానికి వస్తే… విశాఖపట్నంలో జన్మించిన వెంకట సాయి శ్వేత తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎంటర్టైన్మెంట్ రంగంలో తన వృత్తిని స్టార్ట్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఒక తెలుగు సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, అలానే యూట్యూబ్ ఛానల్ కి క్రియేటివి అసోసియేట్ గా చేశారు. ఆ తర్వాత ఒక వార్తాపత్రికకు సబ్ ఎడిటర్ గా, మిర్చి రేడియో స్టేషన్ లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత సినిమాలకు డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టారు.

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. మొదటి సినిమాతోనే 100 కోట్లు మార్క్ ను దాటాడు దర్శకుడుగా బుచ్చిబాబు. అయితే ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో నటించింది కృతి శెట్టి. కృతి శెట్టి కి ఉప్పెన సినిమాలో వాయిస్ ను అందించింది శ్వేత. అలానే భరత్ అనే నేను లో కియారా అద్వానికి, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో ప్రియాంక కి, చిత్రాలహరి సినిమాలో కళ్యాణి ప్రియదర్శినికి ఇలా చాలామంది లీడ్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. దాదాపు మూడేళ్ల లో 80 సినిమాలకు పైగా డబ్బులు చెప్పింది శ్వేత.

- Advertisement -

అలానే సినిమాలతో పాటు 8 బాషల్లో యాడ్స్ కి వెబ్ సిరీస్ కి డాక్యుమెంటరీలకి మొదలైన వాటికి తమ గాత్రాన్ని అందించారు. అయితే ఈమె రీల్స్ ద్వారా ఇంస్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ ను సాధించుకుంది. ఇప్పుడు తను కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. బిగ్ బెన్ సినిమాస్ పై ఈమె దర్శకురాలుగా పరిచయం అవుతుంది. అయితే ఎస్ రాగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతుంది శ్వేత. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ రేపు రిలీజ్ కానుంది. ఈ పోస్టర్ ను తరుణ్ భాస్కర్ భరత్ కమ్మ, కె.వి మహేంద్ర , సంజీవరెడ్డి వంటి యంగ్ దర్శకులు రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫిమేల్ దర్శకులు తక్కువ అనుకున్న తరుణంలో శ్వేతా రూపంలో తెలుగు ఇండస్ట్రీకి మరో ఫిమేల్ దర్శకురాలు ఎంట్రీ ఇస్తుందని చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by P VENKATA SAI SWETHA (@swethapvs)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు