Mouryani : విజయ్ చెల్లెలు చాలా హాట్ గురూ… ఊహించని యాంగిల్స్ లో ఫోజులు

Mouryani : టైటిల్ ని చూడగానే కన్ఫ్యూజ్ అయ్యారా? ప్రస్తుతం విజయ్ పేరుతో ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు ఉండగా, వారిద్దరికీ కూడా చెల్లి లేదు కదా అనే అనుమానం వచ్చిందా? అయితే ఆమె ఎవరో కాదు విజయ్ దేవరకొండ చెల్లెలు. కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.

విజయ్ దేవరకొండ చెల్లిగా..

విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన గీత గోవిందం మూవీలో ఈ బ్యూటీ నటించింది. అది కూడా విజయ్ దేవరకొండ చెల్లిగా. ఆమె పేరు మౌర్యాని. అయితే అందులో అమాయకంగా, అందంగా, సాంప్రదాయ లుక్ లో కనిపించి ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తనలోని గ్లామర్ యాంగిల్స్ అన్నీ బయట పెడుతోంది. ఓవైపు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచాందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే మౌర్యాని తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ లో హాట్ హాట్ లుక్స్ లో కనిపిస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఇస్తున్న ఈ గ్లామర్ ట్రీట్ చూసిన నెటిజన్లు విజయ్ చెల్లెలు చాలా హాట్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

మౌర్యాని తెలుగు సినిమాలు…

మౌర్యాని సైడ్ క్యారెక్టర్లతో పాటు తెలుగులో హీరోయిన్ గానూ కొన్ని సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ చెల్లెలిగా నటించడానికంటే ముందే హీరోయిన్ గా ఓ మూవీలో కనిపించింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇంట్లో దయ్యం నాకేం భయం అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ లో మెరిసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ తెలుగు పేక్షకులకు ఆమె పెద్దగా దగ్గర కాలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ గీత గోవిందం మూవీలో నటించిన క్యారెక్టర్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇలా మొత్తానికి ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఫోటోలకి ఫోజులిస్తూ నెటిజెన్లను ఫిదా చేస్తోంది.

అందంతో పాటే అభినయం కూడా కావలసినంత ఉన్న బ్యూటీ తెలుగు స్టార్ హీరోల దృష్టిలో ఎప్పుడు పడుతుందో చూడాలి. ఆమె ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలమే అవుతున్నా అవకాశాలు మాత్రం పెద్దగా రావట్లేదు. అందుకేనేమో సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరి ఈ బ్యూటీకి బడా డైరెక్టర్స్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో, ఎప్పుడు మంచి ఆఫర్లు కొట్టేస్తుందో చూడాలి. ఆమె అభిమనులైతే ఇప్పటికీ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆమె హాట్ ఫోటోలను చూసి సంతోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు