#DoubleISMART: దీంతల్లి దిమాక్ కిరి కిరి ఐతుంది

#DoubleISMART: బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక తోపు డైరెక్టర్ దొరికాడు అని అనిపించుకున్నాడు ఆ సినిమాతోనే. ఆ తర్వాత చేసిన బాచి సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇకపోతే ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాలను బాక్స్ ఆఫీస్ వద్ద అందించాడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ఒక బ్లాక్ బస్టర్ అని ఫీలైన రోజులు కూడా ఉన్నాయి. కేవలం హీరో క్యారెక్టర్రైజేషన్ తో హిట్టు కొట్టడం అనేది పూరీ జగన్నాథ్ కి మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు.

ఒక మాములు హీరో కూడా పూరి జగన్నాధ్ తో సినిమా చేస్తే ఒక స్టార్ హీరోగా ఎదగొచ్చు అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ సార్ మహేష్ బాబు వంటి హీరోలకు తమ జీవితాల్లో గుర్తుండిపోయేటువంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు పూరి జగన్నాథ్. అలానే చాలామంది హీరోలకి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి లేదని చెప్పొచ్చు. అతి త్వరగా కథను రాసి అంతే త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లి రిలీజ్ కూడా చేసేస్తాడు.

ఇకపోతే పూరి జగన్నాథ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది అని చెప్పొచ్చు. దాదాపు పూరి జగన్నాథ్ కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో, రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 70 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసి పూరి జగన్నాథ్ ని సేఫ్ జోన్ లో పెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వం వహించిన సినిమా లైగర్ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో చాలా లోపలికి వెళ్ళిపోయాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా వలన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ధర్నాలు కూడా చేసే పరిస్థితి వచ్చారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం పూరి డబ్బులు ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు. ఇక రామ్ పోతినేని విషయానికొస్తే రామ్ కూడా ఒక హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలుతున్నాయి. ఇప్పుడు ఒక వైపు రామ్ కి మరో వైపు పూరి జగన్నాథ్ కి వీరిద్దరికి కూడా డబుల్ ఇస్మార్ట్ సినిమా పైనే ఆశలు ఉన్నాయి. అయితే రామ్ బర్త్ డే దగ్గర్లో ఉండటం సందర్భంగా పూరి కనెక్ట్ ప్రొడక్షన్స్ హౌస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అప్డేట్ ను అనౌన్స్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ లోని ఒక స్టిల్ ను వదిలి దీనితల్లి దిమాక్ కిరికిరి అవుతుంది. ఏదో వచ్చేలానే ఉంది అని ఇండైరెక్ట్ గా అప్డేట్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు