Agent beauty : సాక్షి వైద్య కు ఈ సినిమానైనా కలిసొచ్చేనా ?

Agent beauty Sakshi Vaidya

ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా వస్తోన్న లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జున ఈమె కెరీర్ కు వర్క్ అవుట్ అయ్యే సినిమాలాగే కనిపిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి చూస్తే సాక్షి వైద్య ఈ సినిమాలో కేవలం పాటలకు పరిమితమయ్యే విధంగా కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రనే పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటను జులై 31న సాయంత్రం 4 గంటల సమయంలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సాంగ్ కు సంబందించిన ప్రోమోను కాసేపటి క్రితమే రిలీజ్ చేసారు. రెహమాన్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ఈ సీజన్ కు లవ్ మెలోడీ అన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ ప్రోమోను బట్టి చూస్తే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ సాంగ్ ఉండబోతున్నట్టు స్పష్టమవుతోంది.

మొదటి సినిమానే అక్కినేని అఖిల్ భారీ బడ్జెట్ సినిమా అయిన ఏజెంట్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన సాక్షి వైద్య, ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఈమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక ఈ హీరోయిన్ టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం కష్టమే అనుకుంటున్నా సమయంలో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ఆఫర్ రావడం, షూటింగ్ కూడా చక చక జరిగిపోవడంతో సాక్షి కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ లలో యాక్షన్ ప్రధానంగా ఉంటూనే అలాగే హీరోయిన్ సాక్షి వైద్య హైలెట్ అవుతూ వస్తుంది. చూస్తుంటే ఈ సినిమాతో సాక్షికి బ్రేక్ వచ్చేలానే కనిపిస్తోంది. మరి ఏజెంట్ సినిమాతో రాని గుర్తింపు ఈ భామకు గాండీవధారి అర్జునతో నైనా వస్తుందో రాదో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు