Nikhil: పాన్ ఇండియా మూవీలో బంపర్ ఛాన్స్.. కొత్త నటులకి మాత్రమే?

Auditions of “The India House” Movie

టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి “ది ఇండియా హౌస్“. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ వంశి కృష్ణ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యువి ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ తో కలిసి “వి మెగా పిక్చర్స్” అనే బ్యానర్ లో నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక మే లో ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరగగా, “స్పై” మూవీ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దామనుకున్నారు.

ఇక రీసెంట్ గా “స్పై” విడుదలై యావరేజ్ గా ఆడింది. ఇక “ది ఇండియా హౌస్” మూవీ టీమ్ నుండి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాలో నూతన నటీనటులకు ఛాన్స్ ఇస్తూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. పదేళ్ల నుండి 50 ఏళ్ల వరకు ఉన్న చిన్న, పెద్ద నటీనటులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నామని, అప్ కింగ్ యాక్టర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిటైల్స్ తో ఒక ఆడిషన్స్ పోస్టర్ రిలీజ్ చేసారు.

ఇక ఈ సినిమా 1920 బ్యాక్ డ్రాప్ లో వీర్ సావర్కర్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. నిఖిల్ సిద్ధార్థ్ శివ అనే పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శ్యామ్ జి కృష్ణ వర్మ గా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆడిషన్స్ పూర్తయ్యాక ఆగష్టు లో షూటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. కాగా ది ఇండియా హౌస్ సినిమాను 2024 సమ్మర్ లో వీర్ సావర్కర్ జయంతి రోజున విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు