Vijay: లియో లో గ్లోబల్ స్టార్? హింట్ ఇచ్చిన లోకి!

Ramcharan cameo in Leo?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ దళపతి తో “లియో” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ద్వారా సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇంతకు ముందే విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన మాస్టర్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేష్ కానగరాజ్ తన గత సినిమాల కథలను కలుపుతూ మల్టీవర్స్ సినిమాలుగా మారుస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఖైదీకి, విక్రమ్ కి లింక్ పెట్టేసాడు. ఖైదీ2 లో గాని విక్రమ్ 2 లో గాని వాళ్ళు కలవనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా లియో గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతుంది. తాజాగా “లియో” నుండి రిలీజ్ అయిన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక వాయిస్ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫస్ట్ లుక్ టీజర్ లో 0.10 సెకండ్స్ వద్ద వద్ద “ఆంటోనీ” అని పిలిచే ఆ వాయిస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాగా ఉండడంతో ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తున్నాడని గాసిప్స్ ఊపందుకున్నాయి.

ఆ వాయిస్ ఒక్క సెకండే వినిపించినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోదే అని అనుకుంటున్నారు. అదీ గాక గత ఏడాది నుండి లోకేష్ కనగరాజ్ రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నాడన్న వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వాయిస్ లీక్ తో చాలా మంది లియో లో రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. మరి ఇది నిజమో కాదో డైరెక్టర్ లోకేషే క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే విక్రమ్ లో రోలెక్స్ ఎంట్రీ లాగా లియో లో కూడా సప్రైజ్ ఎంట్రీ ప్లాన్ చేసాడో ఏమో మరి. ఏది ఏమైనా ఈ రూమర్లు మాత్రం లియో పై మరింత హైప్ పెరగడానికి హెల్ప్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు